Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనంతపురం ప్లాంట్‌లో ఉత్పత్తి
హైదరాబాద్ : కియా ఇండియా అనంతపురంలోని తమ ప్లాంట్ నుంచి తొలి 'ది కియా కారెన్స్'ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ మూడు వరుసల విశ్రాంతి వాహనం మేడ్ ఇన్ ఇండియా అని తెలిపింది. దీనికి ముందు బహుళ ప్రాంతాలలో దీన్ని పరీక్షించినట్లు కియా ఇండియా సిఇఒ, ఎండి టే-జిన్ పార్క్ తెలిపారు. సంక్రాంతి నుంచే దీనికి ప్రీ-బుకింగ్స్‌ను ప్రారంభించింది. తొలి 24 గంటల్లోనే 7,738 ఆర్డర్లు వచ్చినట్లు ఆ కంపెనీ పేర్కొంది. కాగా.. దీని ధరను ఇప్పటికీ వెల్లడించలేదు.