Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.12,100 కోట్లకు అమ్మకం
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ మరో ప్రభుత్వరంగ సంస్థ (పీఎస్‌యూ)ను కార్పొరేట్లకు విక్రయించింది. వైజాగ్ స్టీల్‌ను ఇప్పటికే అమ్మే పనిలో ఉన్న కేంద్రం.. తాజాగా ఈ రంగంలోని నీలాచల్ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (ఎన్ఐఎన్ఎల్)ను టాటా స్టీల్‌కు కట్టబెట్టింది. రూ.12,100 కోట్లకు ఈ పిఎస్యును విక్రయిస్తూ సోమవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఎయిరిండియాను టాటా గ్రూపునకు అమ్మేసిన విషయం తెలిసిందే. ఎన్ఐఎన్ఎల్లో ఎంఎంటిసి, ఎన్ఎండిసి, భెల్, మెకాన్ లాంటి నాలుగు కేంద్ర పిఎస్యులతో పాటు ఒడిశా ప్రభుత్వంలోని ఓఎంసీ, ఐపీఐసీఓఎల్లకు ప్రధాన వాటాలున్నాయి. వీటన్నిటికీ కలిపి 93.71 శాతం వాటా ఉంది. ఒడిస్సాలోని కలింగనగర్లోని ఈ ఫ్యాక్టరీ ఏడాదికి 11 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సంస్థలో ఇకపై ప్రభుత్వానికి ఎలాంటి వాటా ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఎన్ఐఎన్ఎల్ను విక్రయించింది.