Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాదిలోనే డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసు కురానున్నట్టు బడ్జెట్లో కేంద్రం వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. బ్లాక్ చెయిన్ సాంకేతికతతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీకి రూపకల్పన చేస్తుందని మంత్రి సీతారామన్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా డిజిటల్ కరెన్సీ బూస్టర్లా పనిచేస్తుందని పేర్కొన్నారు. డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ మరింత అభివద్ధి చెందుతుందని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. ఎంత పరిమాణంలో డిజిటల్ కరెన్సీని జారీ చేయాలో ఆర్బీఐ నిర్ణయించనుంది. కాగితపు రహిత కరెన్సీ అయినప్పటికీ దీనిపై ఆర్బీఐ పర్యవేక్షణ ఉంటుంది. క్రిప్టో కరెన్సీలాగా తప్పుడు పద్దతులకు ఉపయోగించడానికి వీలు పడదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.