Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30 శాతం పన్ను విధించనున్నట్లు బడ్జెట్లో కేంద్రం స్పష్టం చేసింది. వీటి విషయంలో స్వాధీన వ్యయం మినహా ఎలాంటి తగ్గింపులను తాము అను మతించబోమని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. డిజిటల్ కరెన్సీల ఆదాయంపై ఇకపై ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదన్నారు. అదే విధంగా క్రిప్టో ఆస్తుల బదిలీ కోసం చేసే ప్రతి లావాదేవీలపై ఒక్క శాతం చొప్పున టిడిఎస్ను విధించనున్నామన్నారు. బహుమతులుగా ఇచ్చే క్రిప్టో ఆస్తులపై కూడా పన్నులు కట్టాల్సిందేనన్నారు. ఈ ఆదాయంపై ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు. త్వరలోనే క్రిప్టో కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. శీతాకాల సమావేశాల్లో ఈ అంశంపై చర్చిస్తామని చెప్పినప్పటికీ వెనక్కి తగ్గింది.