Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అమెజాన్. ఇన్(Amazon.in) ఇప్పుడు సూపర్ వాల్యూ డేస్ తో లైవ్ గా ముందుకు వచ్చి, కిరాణా సామాగ్రులు, గృహావసరాలు, ప్యాక్ చేసిన ఆహారపదార్ధాలు, వ్యక్తిగత సంరక్షణ, శిశు మరియు పెంపుడు జంతువుల సంరక్షణోత్పత్తులు, ఇతర సామాగ్రుల పై 45శాతం వరకు తగ్గింపును తీసుకువచ్చింది. రూ. 1తో మొదలుకుని లభించే డీల్స్ మరియు ప్రైమ్ సభ్యులకు ఉచిత డెలివరీలతో ఫిబ్రవరి 07, 2022 వరకు సూపర్ వాల్యూ డేస్ లైవ్ గా ఉంటాయి. ఆశీర్వాద్, సఫోలా, ఫియామా, లోరియేల్, డాబర్, కాడ్బరీ, కెల్లాగ్, మదర్ డెయిరీ, తదితర ప్రజాదరణ పొందిన బ్రాండ్ల నుండి తాజా ఆఫర్లను మరియు గొప్ప తగ్గింపు ధరలను కస్టమర్లు, సౌకర్యవంతమైన డెలివరీ ఆప్షన్లతో ఒకే ఏకైక ఆన్లైన్ డెస్టినేషన్ నుండి పొందగలరు.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు మరియు క్రెడిట్ ఈఎంఐల పై 1వ -3వ ఫిబ్రవరి 2022 మధ్య మరియు యాక్సిస్ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల పై 4వ-7వ ఫిబ్రవరి మధ్య కనీసం రూ. 2,500 కొనుగోలు పై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా కస్టమర్లు పొందగలుగుతారు..
పాల్గొంటున్న విక్రేతలు అందిస్తున్న ఆఫర్లలో కొన్ని ఈ దిగువ చూడగలరు:
కిరాణా మరియు వంట సామాగ్రులు :
దావత్ రోజానా సూపర్, బాస్మతీ బియ్యం, 5కిగ్రా ఉ దావత్ రోజానా సూపర్, మధ్యతరహా-ధర విభాగంలో అత్యంత ఉత్తమమైన బాస్మతీ రైస్. దీనిని ప్రత్యేకంగా రోజువారి వంట నిమిత్తం, పలురకాల దైనందిన వంటపదార్ధాల కోసం ప్రొసెస్ చేశారు. రోజువారి వినియోగానికి ఇది బాగా అనువైనది. ప్రతి గింజ ప్రకృతిసహజంగా పక్వానికి వచ్చినది కనుక బియ్యం తియ్యని రుచిని, ఘనమైన సువాసనను కలిగి ఉంటాయని దావత్ రోజానా వాగ్దానం చేస్తోంది. Amazon.inపై దాదాపు రూ. 319లకు లభిస్తున్నాయి.
ఆశీర్వాద్ సెలక్ట్ ప్రీమియం షబర్తీ గోధుమపిండి, 5కిగ్రా - గోధుమలకు రాజు నుండి తయారు చేయబడినది - షర్బతీ, ఆశీర్వాద్ సెలక్ట్ ఒక అత్యుత్తమ గోధుమపిండి. ఇది భారతదేశంలో ప్రేమతో తయారుచేయబడినది. షర్బతీ గోధుమపిండిలో, మధ్యప్రదేశ్‌లోని సెహోరే ప్రాంతానికి చెందిన 100 శాతం ఎంపీ షర్బతీ గోధుమలు ఉన్న కారణంగా, మీ రొట్టెలు మృదువుగా మరియు రుచిగా ఉంటాయి. దీనిని Amazon.in దాదాపు రూ. 245 లకు పొందండి.
మల్టీగ్రెయిన్స్ కలిగిన ఆశీర్వాద్ గోధుమపిండి, 5 కిగ్రా ఉ ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ గోధుమపిండితో మీ రోజువారి ఆహారానికి పీచుపదార్ధాన్ని జోడించండి. దేశవ్యాప్తంగా ఉన్న పొలాల నుండి ఎంపిక చేసిన గింజలతో తయారు చేయబడినది. ఈ మల్టీగ్రెయిన్ గోధుమపిండి 6 ప్రకృతి సహజమైన ధాన్యాలు ఉ గోధుమలు, జొన్న, ఓట్స్, సోయా, శనగ మరియు సిలియం ఊకలతో తయారు చేయబడింది. పిండిలో పీచుపదార్ధం ఎక్కువగా ఉండి, ఆహారం అరుగుదలకు మరియు, ఆంత్రాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తుంది. ఈ శక్తివంతమైన మల్టీగ్రెయిన్ గోధుమపిండిలో, మానవశరీరం ఫిట్‌గా, చురుగ్గా మరియు ఆలోగ్యంగా ఉండేందుకు అవసరమైన అత్యవసర పదార్ధాలు ఉంటాయి. Amazon.in పై దీనిని దాదాపు రూ. 255లకు పొందండి.
సఫోలా గోల్డ్ రిఫైండ్ కుకింగ్ ఆయిల్, 5లీ - సఫోలా గోల్డ్ మల్టీసోర్స్ వంటనూనె, మీ కుటుంబం యొక్క గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడగలదు. ఈ వెజిటబుల్ నూనెలో MUFA & PUFA మధ్య చక్కని సమతౌల్యం, దానితోపాటు మీ రోగనిరోధకను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన యాంటీఆక్సిడెంట్ వ్యవస్థ ఉన్నది. సఫోలా గోల్డ్, ఓరిజనోల్ కలిగి ఉన్నది. ఇది ఆరోగ్యవంతమైన కోలస్ట్రాల్ ప్రమాణాలను కాపాడుకునేందుకు సహాయపడుతుంది. ఆహారంలో 33 శాతం తక్కువ నూనె పీల్చుకునేందుకు ఇందులో LOSORB™సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. సమతుల ఆహార పద్ధతిని, సక్రియమైన జీవనశైలిని అనుసరించేందుకు సఫోలా మిమ్మల్ని ప్రోత్సహిస్తోంది. Amazon.in పై దాదాపు రూ. 1047 అందుబాటులో ఉన్నది.
మదర్ డెయిరీ కౌ ఘీ, 1లీ ఉ ఆయుర్వేదంలో ఆవునూనె, మానవుల వినియోగానికి అత్యుత్తమమైనదని నమ్మకం. కంటిచూపుకు, శరీరం ఎదుగుదలకు, ఎముకల్లో జైవికచర్యలకు మరియు రోగనిరోధక కార్యకలాపాలకు అత్యవసరమైన విటమిన్ ఎ ఇందులో పుష్కలంగా లభిస్తుంది. మదర్ డైరీ కౌ ఘీ (ఆవు నెయ్యి) యొక్క మృదుత్వం మరియు సహజమైన రంగు కారణంగా గొప్ప రుచి లభిస్తుంది, గరిష్టంగా 8 నెలల షెల్ఫ్ లైఫ్ లభిస్తుందిAmazon.in పై పై దాదాపు రూ. 440లకు లభిస్తుంది.
గృహావసరాల కోసం లభిస్తున్న వస్తుసామాగ్రులు :
గోద్రెజ్ ఈజీ 2-ఇన్-1 లిక్విడ్ డిటర్జెంట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ (ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ ఉ గోద్రెజ్ ఈజీ 2-ఇన్-1 లిక్విడ్ డిటర్జెంట్‌లో అన్ని రకాల దుస్తులు మరియు బట్టలను శుభ్రం చేయగల అధునాతనమైన క్లెన్జింగ్ ఫార్ములా ఉన్నది. దీనిలోని నిబిడీకృత సువాసన అణువుల కారణంగా సువాసన ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది. దీనిలోని కండిషనింగ్ లక్షణం కారణంగా దుస్తులు మృదువుగా, మెత్తగా ఉండి, ధరించినప్పుడు గొప్ప అనుభూతి లభిస్తుంది. దుస్తుల పటుత్వాన్ని, రంగును యథాతథంగా ఉంచుతూనే ఇది, మొండి మరకలను తొలగించి, దుస్తుల మీద లేదా మెషీన్‌లోనూ ఎటువంటి మలినాన్ని మిగల్చదు. బకెట్ వాష్ లేదా మెషీన్ (ఫ్రంట్ మరియు టాప్ లోడ్లు రెండు) వాష్ రెండింటిలోనూ దీనిని ఉపయోగించటం సులభం. Amazon.in పై ఇది 2 కిగ్రాల సూపర్ సేవల్ పౌచ్‌లో దాదాపు రూ. 179కి కూడా లభిస్తోంది.
(ప్రిల్ డిష్ వాషింగ్ లిక్విడ్ (2లీ) ఉ 1999లో ప్రవేశపెట్టిననాటి నుండి ప్రిల్ లిక్విడ్, పాత్రలు శుభ్రం చేసే విభాగంలో అగ్రశ్రేణిలో ఉన్నది. దీనిలోని జిడ్డును బాగా కరిగించగల మరియు త్వరగా డ్రై కాగల ఫార్ములా కారణంగా ప్రిల్ ఒక అత్యుత్తమ శుభ్రత ఏజెంట్ అయ్యింది. మా కస్టమర్లకు కేవలం అత్యుత్తమమైన ఉత్పత్తిని అందించేందుకు ప్రిల్ లిక్విడ్‌లో ఒక విలక్షణమైన ఫార్ములా ఉన్నది. ఆ ఫార్ములా కారణంగా ప్రిల్ చేతులకు మృదువాగా ఉండి, ఎటువంటి ఇబ్బందిని కలిగించదు. ఇందువలన, పాత్రలు బాగా శుభ్రం కావటమే కాక, చేతులు శుభ్రంగా, మృదువుగా మరియు హాయిగా ఉంటాయి. మీరు దీనిని Amazon.in పై దాదాపు రూ. 375కి కొనుగోలు చేయగలరు.
99.9శాతం యాంటీ-బ్యాక్టీరియల్ సంరక్షణ కోసం వేప శక్తితో కూడిన నిమైల్ ఈకో ఫ్రెండ్లీ ఫ్లోర్ క్లీనర్, 2లీ - మీ ఇంటిని తాజాగా, క్రిమి-రహితంగా చేసుకోండి నిమైల్తో. నిమైల్లో వేప శక్తి ఇమిడి ఉంటుంది. దీనిలోని వేప శక్తి కలిగిన విలక్షణమైన ఫార్ములేషన్ 99.9 శాతం క్రిములను తొలగిస్తుంది, తద్వారా యావత్తు కుటుంబానికి పరిశుభ్రతాపరమైన రక్షణను అందిస్తుంది. ప్రకృతిసహజమైన పదార్ధాలు కలిగిన ఈ డిజిన్ఫెక్టాంట్ 100 శాతం సహజంగా పని చేస్తుంది, చక్కగా శుభ్రం చేస్తుంది, గచ్చుల పై ఉపయోగించటానికి సురక్షితమైనది. అందువలన ఇది కుటుంబానికి అవసరమైన పరిశుభ్రతను అందిస్తుంది. దాదాపు రూ. 281కి లభిస్తున్నది.
శానీఫ్రెష్ అల్ట్రాషైన్ – శానీఫ్రెష్ అల్ట్రాషైన్ టాయిలెట్ క్లీనర్, భారతీయ మరియు పాశ్చాత్య టాయిలెట్లు రెండింటికీ అనువైనది. దీనిలోని అధునాతన గాఢతా ఫార్ములేషన్ కారణంగా టాయిలెట్‌ను అసామాన్యంగా శుభ్రం చేయటమే కాక, శుభ్రం చేయటంలో సమయాన్ని, శ్రమను కూడా తగ్గిస్తుంది. అత్యంత మొండి మరకలను కూడా తొలగించే, త్వరితగతిన మెరుగైన మరియు సమర్ధవంతమైన క్లీనింగ్‌ను అందించే, ఎక్కువ సైపు నిలిచి ఉండే సువాసనను అందించే 10 రెట్లు ఎక్కువ క్లీనింగ్ శక్తి కలిగి ఉండే సక్రియమైన క్రిమిసంహారక ఫార్ములా దీనిలో ఉన్నది. ఇది 99.9 శాతం క్రిములను సంహరించటంలో సహకరిస్తుంది. దాదాపు రూ. 145కి Amazon.in పై లభిస్తున్నది.
మీ వ్యక్తిగత సౌందర్యసాధనాలు మరియు ఉపకరణాల అవసరాలను అందిస్తుంది:
లోరియేల్ ప్యారిస్ టోటల్ రిపెయిర్ 5 షాంపూ, 1లీ - లోరియేల్ ప్యారిస్ టోటల్ రిపెయిల్ 5 రిపెయిరింగ్ షాంపూ, కేశాలు పాడవుతున్నాయని సూచించే అయిదు రకాల కీలక సంకేతాలైన- జుట్టు ఊడిపోటం, పొడిదనం, రఫ్‌నెస్(బిరుసుదనం), డల్‌నెస్ (జీవంలేనట్లుండటం), మరియు కొసల్లో స్ప్లిట్ లతో జుట్టును ఒత్తుగా ఉంచుతూనే పోరాడేందుకు సహాయపడుతుంది. కేశాల్లో నాచురల్ సిమెంట్ కొరవడే కారణంగా జుట్టు బలంగా, దృఢంగా ఉండకపోవచ్చు. కేశాలలో పటుత్వాన్ని, బలాన్ని నిలిపి ఉంచేందుకు, లోరియేల్ లాబొరేటరీస్ సృష్టించింది సెరామైడ్-సిమెంట్ సాంకేతికపరిజ్ఞానం. ఇది జుట్టు యొక్క నాచురల్ సిమెంట్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచి, ఈ 5 సమస్యలతో పోరాడుతుంది. డామేజ్డ్ హెయిర్‌లో మళ్ళీ జీవం నింపి, దానిని బాగుచేసుకునేందుకు Amazon.in పై దాదాపు రూ. 467లకు అత్యుత్తమ కేశసంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.
5 విలక్షణ జెల్ బార్లతో ఫియామా జెల్ బార్ సెలబ్రేషన్ ప్యాక్ 4 కొని 1 ఉచితంగా పొందండి ఉ ప్రకృతిసహజమైన పదార్ధాల సద్గుణాలతో, ఫియామా వారి విలక్షణమైన జెల్ బార్స్‌ను ఇంటికి తెచ్చుకోండి. ఇవి మీ చర్మం మృదువుగా, హాయిగా ఉండేందుకు ఉపకరిస్తాయి. 4 కొని 1 ఉచితంగా పొందే ఆఫర్‌తో Amazon.in పై ప్యాక్ ఆఫ్ 5ను, దాదాపు రూ. 263కు పొందగలరు.
బాగా పొడిగా ఉండే చర్మం కోసం నివియా బాడీ లోషన్- నివియా బాడీ లోషన్‌తో ప్రతిరోజూ ఆరోగ్యవంతమైన, తేమ కలిగిన చర్మాన్ని పొందండి. దీనిలోని లోతైన మాయిశ్చర్ సీరమ్ ఫార్ములా, మీకు 48 గంటల పాటు తేమగా ఉండే చర్మాన్ని అందిస్తుంది. Amazon.in పై దీనిని దాదాపు రూ. 411లకు పొందగలరు.
పామోలివ్ అరోమా ఆబ్జొల్యూట్ రిలాక్స్ బాడీ వాష్ ఉ ఆహ్లాదాన్ని కలిగించే సువాసన మొదలుకుని శుభ్రతను అందిస్తూ మీ అనుభవాలను అద్భుతంగా మలచే సద్గుణాలతో పాటు రిలాక్స్ అయ్యేందుకు మీరు కోరుకునే అన్ని సద్గుణాలు ఈ పామోలివ్ షవర్ జెల్లో మీకు లభిస్తాయి. అమోఘమైన వైలాంగ్ ఆయిల్ మరియు ఐరిస్ ఎక్స్ట్రాక్టుల చక్కని మిశ్రమం ఇందులో లభిస్తుంది. ఇది మీకు ఆహ్లాదాన్ని ఇచ్చే షవర్‌ను అందిస్తుంది. దీనిని మీరు పొందగలరు దాదాపు రూ. 374కు.
చర్మ మరియు కేశ సంరక్షణ కోసం WOW స్కిన్ సైన్స్ అలో వేరా మల్టీపర్పస్ బ్యూటీ జెల్ - WOWచర్మసంరక్షక శాస్త్రవిజ్ఞాన అలో వేరా జెల్‌తో మీ చర్మానికి మరియు కేశాలకు సౌందర్యపోషణను అందించండి. బాటిల్లో మీకు లభించగల అత్యంత పరిశుద్ధమైన మరియు అత్యద్భుతమైన అలోవేరా జెల్ ఇది. పండిన, బలమైన మరియు రసభరితమన అలోవేరా ఆకుల నుండి పరిశుభ్రమైన పద్ధతిలో సేకరించి, ఇందులోని ప్రకృతిసహజమైన ఆరోగ్యాన్ని అందించే సద్గుణాలు మరియు ఉత్సహాన్ని నింపే సద్గుణాలు చెదిరిపోకుండా జాగ్రత్తగా ఈ జెల్ ప్యాక్ చేయబడినది. అలో వేరాను వేలాది సంవత్సరాలుగా సౌందర్య మరియు వైద్యపరమైన లాభాల కోసం పలు ప్రాంతాల ప్రజలు ఉపయోగిస్తూ వస్తున్నారు. విటమిన్లు, ఎంజైములు, ఖనిజాలు మరియు అమీనో ఆమ్లాల వంటి 75 సద్గుణాల పోషకాలకు పైగా అలో వేరాలో నిండి ఉన్నాయి. ఇది క్రిములను మరియు సూక్ష్మక్రిములను దరిచేరనీయక, చర్మానికి తేమను అందిస్తుంది. కేశాల కోసం మరియు జుట్టు కుదుళ్లలో ఉపయోగించినప్పుడు ఇది, పొడిబారకుండాను, పాడుకాకుండాను కేశాలకు రక్షణ కల్పిస్తుంది. దాదాపు రూ. 235కు లభిస్తుంది.
ప్యాకేజ్ చేసిన ఆహారపదార్ధాలను ఆస్వాదించండి:
కెల్లాగ్స్ మ్యూస్లీ 20% నట్స్ డిలైట్ ఉ కెల్లాగ్స్ వారి మ్యూస్లీ 20% నట్స్ డిలైట్, అల్పాహారంగా తినటానికి సిద్దంగా ఉండే సెరెల్. ఇందులో 5 ధాన్యాల సద్గుణాలు మరియు ఎండుద్రాక్ష మరియు క్రంచీగా ఉండే బాదంపప్పుల మిశ్రమం పుష్కలంగా లభిస్తుంది. మల్టీగ్రెయిన్ సద్గుణాలు నిండి ఉన్న, ఆనందాన్ని కలిగించే అల్పాహారం ఇది. మీ ఉదయాలు ఎంతో ఉత్సాహంగా ప్రారంభమై, మిగిలిన రోజు కోసం మీరు సంసిద్ధమయ్యేందుకు ఇది బాగా ఉపకరిస్తుంది. దీనిలోని అందం, ఇందులోని నిరాడంబరతే ఉ గుప్పెడు కెల్లాగ్స్ మ్యూస్లీ తీసుకోండి, ఇందులో మీకు ప్రకృతిసహజమైన ధాన్యాలు, నట్స్ సద్గుణాలు మీకు దర్శనమిస్తాయి. Amazon.in పై దాదాపు 345కు లభిస్తాయి.
కాడ్బరీ ఓరియో ఒరిజినల్ చాక్లెటరీ శాండ్విచ్ బిస్కట్ ఫ్యామిలీ ప్యాక్ ఉ మధ్యాహ్న వేళల్లో మరియు అర్ధరాత్రి ఆకలి కోసం, కాడ్బరీ ఓరియో ఒక చక్కని స్నాక్. క్రీమ్ ఫిలింగ్ లోని ఘనమైన మరియు మృదువైన ఫ్లేవర్లతో పాటు క్రంచీగా ఉండే చాక్లెట్ బిస్కెట్‌లోని బోల్డ్ టేస్ట్‌ను ఇది మీకు అందించి, మీరు మెచ్చుకునేట్లు చేస్తుంది. Amazon.in పై దీనిని దాదాపు రూ. 62కు పొందండి.
టాటా టీ ప్రీమియం, 1500గ్రా – ‘చాయ్’ అంటే ఒక కప్పు టీ కన్నా మరెంతో ఎక్కువబీ నిజానికి ఇది ప్రతి భారతీయుని సంస్కృతిలోనూ, జీవితంలో నిబిడీకృతమై ఉన్నది. చాయ్ తాగటాన్ని దేశవ్యాప్తంగా ఆస్వాదిస్తూంటారు. భారతదేశంలోని వేరు వేరు ప్రాంతాల్లో ప్రజలు తమ కప్‌ను ఆస్వాదిస్తూ ఉంటారు. టాటా టీ ప్రీమియం-దేశ్ కీ చాయ్, కేవలం భారతదేశం నుండి తయారు చేయబడిన చాయ్. ఇది దేశంలోని వేరు వేరు ప్రాంతాల ప్రజల విభిన్నమైన రుచులను అర్ధం చేసుకున్నది. అందుకే మా టీ నిపుణులు ఒక విలక్షణమైన బ్లెండ్(మిశ్రమం)ను భారతదేశవ్యాప్తంగా చాయ్ ప్రియులందరూ ఆస్వాదించేట్లు రూపొందించారు. Amazon.in పై దాదాపు రూ. 499కి లభిస్తోంది.
గమనిక: ఉత్పత్తి వివరాలు, వివరణ మరియు ధరలు, విక్రేతలు/బ్రాండ్లు అందించినమేరకు తెలిపినవి. ధరనిర్ధారణ లేదా ఉత్పత్తి వివరణలో అమెజాన్ ప్రమేయము లేదు. విక్రేతలు అందించిన ఉత్పత్తి సమాచారం యొక్క ఖచ్ఛితత్వం, నిజానిజాలు లేదా సంపూర్ణత విషయంలో మా బాధ్యత ఏమీ లేదని తెలియచేయటమైనది.