Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై భారీగానే పన్నులు ఉంటాయని ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ వెల్లడించారు. గుర్రపు పందేలు గెలవడం, బెట్టింగులు, ఊహాజనిత లావాదేవీలపై ఎలాంటి పన్నులయితే అమల్లో ఉన్నాయే.. అదే తరహాలో పన్నులు వసూలు చేయడానికి నిబంధనలను రూపొందిస్తున్నామన్నారు. క్రిప్టో ఆస్తుల కోసం ఒక ప్రత్యేకమైన పన్నుల విధానాన్ని అవలంభించనున్నామన్నారు. క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్ను వసూలు చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. జూదంలో ఎలాగైతే గెలిచిన వాళ్ల దగ్గరి నుంచి పన్నులు వసూలు చేస్తారో.. అదే తరహాలో క్రిప్టో లావాదేవీలపై పన్నుల వసూళ్లు ఉంటుందని సోమనాథ్ తెలిపారు. క్రిప్టో కరెన్సీని కొనడం, అమ్మడం చట్ట వ్యతిరేకం ఏమీ కాదన్నారు. అయితే ప్రస్తుతానికి ఇదొక సందిగ్దంగా ఉందన్నారు.