Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఒత్తిడి, పోషకాల లేమి, శారీరక శ్రమ లేకపోవడం, డిజిటల్ తెరలకు అతుక్కుపోవడంతో యువతీ, యువకుల్లోనూ జుట్టు రాలడం, చర్మం ముడతలు పడడం, వద్ధాప్యం, గోర్లు పెలుసుబారడం వంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. ఇందుకు పరిష్కారంగా ఫార్మా కంపెనీ లీ హెల్త్ డొమెయిన్ 'నేచురల్ కేర్' పేరుతో వినూత్న, సహజ ఔషధాన్ని ఆవిష్కరించినట్లు ఆ కంపెనీ తెలిపింది. వీటిని వైద్యపరంగా నిరూపించబడిన ఫైటో న్యూట్రీయంట్స్, బయో న్యూట్రాసూటికల్స్తో ఈ సాఫ్ట్ జెల్ క్యాప్యూల్స్ను తయారుచేసినట్లు పేర్కొంది. గుడ్డు పెంకు నుంచి తీసిన పొర, బయోటిన్, కెరాటిన్, స్పైరులినాతోపాటు ఉసిరి, ద్రాక్ష గింజలు, వెదురు నుంచి తీసిన సారం, ఎల్లాజిక్ యాసిడ్ ఇందులో ఉన్నాయనిలీ హెల్త్ డైరెక్టర్ లీలా రాణి ఆళ్ల తెలిపారు. చర్మం, వెంట్రుకలు, గోర్లను ఆరోగ్యంగా ఉంచేందుకు, యవ్వనాన్ని తిరిగి పొందేందుకు ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.