Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కియా ఇండియా, దేశంలో అతి వేగంగా పెరుగుతున్న కారు తయారీదారు, 2019, సెప్టెంబర్ లో సెల్టోస్ ని షిప్పింగ్ చేయడం ఆరంభించిన నాటి నుండి తన ఎగుమతులలో 1 లక్ష వాహనాల్ని నమోదు చేయడం ద్వారా మరొక మైలురాయిని అధిగమించింది. కంపెనీ ఈ ఉన్నతమైన ఈ గణాంకాన్ని కేవలం రెండున్నర ఏళ్లల్లో సాధించింది, భారతదేశాన్ని ఎగుమతికి కేంద్రంగా అభివృద్ధి చేసే తమ నిబద్ధతని పునరుద్ఘాటించింది. కంపెనీ భారతదేశపు నిజమైన నాణ్యతా ప్రామాణాలకు చిహ్నాలైన సెల్టోస్ మరియు సానెట్ లని మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా , మధ్య & దక్షిణ అమెరికా, మెక్సికో మరియు ఆసియా-పసిఫిక్ వంటి ప్రాంతాల్లో 91 దేశాలకు ఎగుమతి చేసింది. ప్రస్తుతం, సెల్టోస్ మరియు సానెట్ లు యొక్క ఎగుమతుల వాటా వరుసగా 77% మరియు 23% గా ఉంది. విలక్షణమైన ఆఫరింగ్ గా చేసి బ్రాండ్ తన షిప్పింగ్ యూనిట్స్ ని కూడా అనుకూలంగా చేసింది, ముఖ్యంగా ఎగుమతి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మార్చింది.
ఆరంభం నుండి జనవరి, 2022 వరకు, కంపెనీ మొత్తం 1,01,734 వాహనాల్ని ఎగుమతి చేసింది. సీవై 2021లో, కంపెనీ 46,261 యూనిట్లని షిప్ చేసింది, ఎగుమతులలో 23% వై-ఓ-వై పెంపుదలని నమోదు చేసింది. కియా ఇండియా 25%కి పైగా మార్కెట్ వాటాతో దేశంలోనే నంబర్ 1 యూవీ ఎగుమతిదారుగా మారింది. ఇంకా, బ్రాండ్ మొత్తం పీవీ విభాగంలో బ్రాండ్ మూడవ ర్యాంక్ పొంది సుమారు 9% మార్కెట్ వాటా సంపాదించింది. ఈ మైలురాయి గురించి వ్యాఖ్యానిస్తూ, టే-జిన్-పార్క్, ఎండీ & సీఈఓ, కియా ఇండియా ఇలా అన్నారు, "భారతదేశం కియా కార్పొరేషన్ కోసం కేవలం సేల్స్ విషయంలోనే కాకుండా భారతదేశాన్ని ఒక తయారీ మరియు ఎగుమతుల వేదికగా అభివృద్ధి చేసే విషయంలో కూడా ఒక కీలకమైన భూ ప్రాంతంగా నిలిచింది. ఎస్ యూవీలు కోసం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ తీర్చడానికి , మా ఆధునిక అనంతపురం ప్లాంట్ పొందికైన మరియు మధ్యస్థ సైజ్ గల ఎస్ యూవీలని తయారు చేసే అత్యంత కీలకమైన తయారీ కేంద్రాలలో ఒకటిగా నిలిచింది. మా భారతదేశం కేంద్రంగా తయారైన మోలడల్స్ సెల్టోస్ మరియు సోనెట్ లు అంతర్జాతీయ మార్కెట్ లో విజయం సాధించడం మాకు ఎంతో ఆనందం కలిగించింది; మా భారతదేశపు ఉత్పత్తులు నిజమైన అంతర్జాతీయ స్వభావాన్ని కలిగి ఉన్నాయని వాస్తవాన్ని తెలియచేసాయి. మేము కారెన్స్ కోసం ప్రధాన ప్లాంట్ గా నిలిచి, ప్రపంచానికి సేవలు అందిస్తున్న భారతదేశంలోని తయారీ సదుపాయంతో ఈ సానుకూలమైన ప్రతిస్పందన ద్వారా రూపొందించడం కొనసాగించాలని ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉన్నాము." కియా వారి 'మేక్-ఇన్-ఇండియా' కలని దేశంలో తన విజయానికి సహాయపడటమే కాకుండా, భారతదేశం తయారీ నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించిందని ఈ విజయం నిరూపించింది.