Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిక్కీ జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ నర్రా రవికుమార్
హైదరాబాద్: షెడ్యూల్ కులాల ఇమేజ్ మార్చే పని డిక్కీ చేస్తుందని దళిత్ ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(డిక్కీ) జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ నర్రా రవికుమార్ అన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థల్లో షెడ్యూల్ కులాలు క్రియాశీలక పాత్ర పోషించాలని, ట్యాక్స్ పేయర్లుగా ఎదగాలని పిలునిచ్చారు. ఈ మేరకు గురువారం తెలంగాణ చాప్టర్ ఎస్సి, ఎస్టీ కాంట్రాక్టర్స్ మీట్ హైదరాబాద్ లోని డిక్కీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్బంగా రవికుమార్ మాట్లాడుతూ పారిశ్రామిక రంగంలో షెడ్యూల్ కులాలు అభివృద్ధి చెందాలన్నారు. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి డిక్కీ పనిచేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి డిక్కీకి ముందు డిక్కీకి తర్వాత అనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. 2015లో ఏర్పడ్డ డిక్కీ స్వతంత్రంగా ముందుకు వెళ్తున్న సంస్థ అన్నారు. 59 జీవో పెద్ద చరిత్ర అన్నారు. దళితులు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ సాధించుకోవాలన్నారు. డిక్కీ సహకారంతో 54 వేల మంది స్టాండ్ అప్ ఇండియా ద్వారా లోన్ లు తీసుకున్నారని అన్నారు. అతి తక్కువ కాలంలో దేశంలోనే 4వ స్థానంలో డిక్కీ నిలిచిందాన్నారు. భవిష్యత్ తరాలకు డిక్కీ 'నెస్ట్ జనరేషన్'ను ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డిక్కీ సహకారంతో వివిధ రంగాలలో అభివృద్ధి చెందిన కాంట్రాక్టర్లు, పారిశ్రామికమిక వేత్తలు తమ అనుభవాలను పంచుకున్నారు. ఆర్ధికంగా అభివృద్ధి చెందడానికి డిక్కీ ఎంతో సహకారం అందిస్తుందన్నారు. ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే మరింత ముందుకు వెళ్తమన్నారు. డిక్కీని పటిష్టం చేసి భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ దాసరి అరుణ, కె.రవి, డిక్కీ మహిళా విభాగం కో-ఆర్డినేటర్ ఎస్.కృష్ణవేణి, మాజీ ఐడీఎఎస్ అధికారి పీఎస్ ఎన్ మూర్తి, శ్రీరామ్ ఆనంద్, వరుణ్ కుమార్, వనజాక్షి, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.