Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ హెచ్) , భారతదేశంలో అతిపెద్ద ఆటోమేకర్ కంపెనీకి మాతృసంస్థ అయిన సుజుకీ మోటర్ కార్పోరేషన్ (ఎస్ఎంసీ), జపాన్‌తో మూడు సంవత్సరాల కాలానికి ఒప్పందం చేసుకుని సుజుకీ ఇన్నోవేషన్ కేంద్రం (ఎస్ఐసీ) ప్రారంభించింది. ఈ రెండు సంస్థల నడుమ విజ్ఞాన మార్పిడి కోసం ఓ వేదికను అందించడం ద్వారా ఇండియా మరియు జపాన్ల కోసం ఆవిష్కరణలను సృష్టించడం ఈ కేంద్రం యొక్క ముఖ్య లక్ష్యం. పరిశ్రమలు, విద్యా సంస్థలు మరియు స్టార్టప్స్ నడమ బహిరంగ ఆవిష్కరణల కోసం సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ (ఎస్ఐసీ) ఒక వేదికగా నిర్వహించబడుతుంది. నైపుణ్యాభివృద్ధి మరియు ఇండియా, జపాన్ల నడుమ మానవ వనరుల మార్పిడికి సైతం ఈ కేంద్రం మద్దతునందించనుంది. ఇండియా మరియు జపాన్ నడుమ బంధాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించేందుకు ఐఐటీహెచ్‌కు మరో మైలురాయిగా ఎస్ఐసీ నిలువనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా, టెక్నాలజీ రీసెర్చ్ పార్క్‌లో ఈ కేంద్రానికి అవసరమైన సహాయాన్ని ఐఐటీహెచ్ అందించనుంది. ఈ కార్యక్రమం గురించి ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ ఎస్ మూర్తి మాట్లాడుతూ ‘‘గత కొద్ది సంవత్సరాలుగా సుజుకి మోటర్ కార్పోరేషన్ మరియు ఐఐటీహెచ్ నడుమ సంచిత విజయగాథల ఫలితం ఇది. ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం భారత మరియు జపనీస్ సమాజాల కోసం సమగ్ర విలువను సృష్టించడం. సుజుకీ మోటర్ కార్పోరేషన్‌తో పాటుగా రాబోయే ఇతర వాటాదారులతో అతి సన్నిహితంగా ఐఐటీహెచ్ పనిచేయడంతో పాటుగా ఇండియా మరియు జపాన్లలో సాంకేతికత మరియు డిజైన్ యొక్క సినర్జిటిక్ కలయికతో మొబిలిటీకి ఆవల ఎదురవుతున్న విస్తృత శ్రేణి సవాళ్లను సైతం గుర్తించి పరిష్కరించనుంది. మా క్యాంపస్‌లో మేము తీర్చిదిద్దుతున్న లీడర్స్‌కు ప్రతీకగా ఈ కేంద్రం నిలువనుంది. ఐఐటీహెచ్ యొక్క యువ, శక్తివంతమైన అల్యూమ్ని : విపుల్ నాథ్ జిందాల్ మరియు ప్రత్యూష తమ్మినేని లు ఈ మొత్తం కార్యక్రమానికి నాయకత్వం వహించారు’’అని అన్నారు. సుజుకీ ఇన్నోవేషన్ కేంద్రంలో పూర్తి స్ధాయిలో కార్యక్రమాలు ఈ సంవత్సర రెండవ త్రైమాసంలో ప్రారంభించాలని ప్రణాళిక చేయడం జరిగింది.