Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశ పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్స్ మాస్టర్ ఫ్రాంచైజీ అయిన హార్డ్ క్యాజిల్ రెస్టారెంట్స్ ప్రై.లి. యాజమాన్యమైన వెస్ట్ లైఫ్ డెవలప్ మెంట్ లిమిటెడ్ (BSE: 505533) ("WDL") 2021 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికానికి తన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. నేడిక్కడ జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నారు. కంపెనీ ముమ్మర పనితీరుతో అన్ని నిర్వహణ పరామితుల్లో కూడా పటిష్ఠ త్రైమాసికాన్ని నమోదు చేసింది. కా ర్యకలాపాలకు సంబంధించి నూతన ప్రమాణాలను నెలకొల్పింది. కంపెనీ ఇంతకు ముందెన్నడూ లేనంత అధి కంగా రూ. 4768.3 మిలియన్ల ఆదాయం సాధించింది. ఏటేటా ప్రాతిపదికన గణనీయంగా 46.7% మేర వృద్ధి. డై న్ – ఇన్, కన్వీనియన్స్ చానల్స్ రెండింటిలోనూ వృద్ధితో ఇది సాధ్యపడింది. అవి వరుసగా 39% మరియు 55% వృద్ధి సాధించాయి. ఈ త్రైమాసికానికి కంపెనీ సేమ్ స్టోర్ సేల్స్ ఏటేటా ప్రాతిపదికన 44% వృద్ధితో ఉన్నాయి. కంపెనీ తన వ్యయ తగ్గింపు వ్యూహాల అమలును కొనసాగించనుంది. అన్ని రకాల ధరల పెరుగుదల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కంపెనీ, ఏటేటా ప్రాతిపదికన 48.2% మెరుగుదలతో 66.4% పటిష్ఠ స్థూల లాభాలను ఆర్జించింది. ఇది ఏటేటా ప్రాతిపదికన 60.3% వృద్ధితో రెస్టారెంట్ ఆపరేటింగ్ మార్జిన్లు 22.6%.గా నిలిచేలా చేసింది. ఇది రూ. 836.2 మిలియన్ల అధిక ఈబీఐటీడీఏ ను కూడా నమోదు చేసింది. ఏటేటా ప్రాతిపదికన 61.0% పె రుగుదలతో ఇది ఈబీఐటీడీఏను నూతన శిఖరాలకు చేర్చింది. ఫలితంగా కంపెనీ గతంలో ఎన్నడూ లేని స్థా యిలో రూ. 208.2 మిలియన్ల పీఏటీ ని సాధించింది.
కంపెనీ ఇప్పుడు దూకుడుతో కూడిన విస్తరణ ప్రణాళికలతో ఉంది. ఈ త్రైమాసికంలో ఇది 8 నూతన స్టోర్లను ప్రారంభించింది. దీంతో 44 నగరాల్లో మొత్తం స్టోర్ల సంఖ్య 316కు చేరుకుంది. దీని రెస్టారెంట్లలో సుమారుగా 80 శాతం ఇప్పుడు వాటిలో మెక్ కెఫె ను కలిగిఉన్నాయి, వాటిలో వంద ‘ఎక్స్ పీరియెన్స్ ఆఫ్ ది ఫ్యూచర్’ (ఈఓ టీఎఫ్) రెస్టారెంట్లు. 2011 అక్టోబర్ లో కంపెనీ, రెస్టారెంట్ల సంఖ్యను 500కు పెంచేందుకు, రెస్టారెంట్లను ఈఓటీఎఫ్ గా మార్చేం దుకు, డిజిటల్ సామర్థ్యాలను పెంచుకునేందుకు, అధునాతన మెనూలను రూపొందించేందుకు రాబోయే 3-5 ఏళ్లలో రూ.800-1000 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. మెనూ ఇన్నోవేషన్, ఓమ్ని చానల్ ఉనికి, నెట్ వర్క్ విస్తరణ అనేవి వెస్ట్ లైఫ్ వ్యూహంలో కీలక చోదక శక్తు లుగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో కంపెనీ నూతన గార్మెట్ బర్గర్ కలెక్షన్ ను తన మెనూ కు జోడించింది. ఈ నూతన శ్రేణి బర్గ ర్లు, ఫ్రైడ్ చికెన్ ప్లాట్ ఫామ్‌తో మరియు మెక్ కెఫెతో కలసి, ఏ విధమైన గణనీయ క్యాపెక్స్ ఇన్వెస్ట్ మెంట్ లే కుండానే, కంపెనీ యావరేజ్ యూనిట్ వాల్యూమ్ (ఏయూ వీ) వృద్ధి 30% దాకా ముమ్మరం చేయడంలో తోడ్పడ్డాయి. కంపెనీ అనుసరించే ఓమ్ని ఛానల్ వ్యూహం తో మెనూను బాగా అందుబాటులోకి తీసుకురాగలిగింది. డైన్ ఇ న్ లో చక్కటి వృద్ధి సాధించగలిగింది. ఈ త్రైమాసికంలో కూడా డైన్ –ఇన్ ఆంక్షలను చాలా వరకు సడలించిన ప్పటికీ, కన్వీనియన్స్ చానల్స్ నుంచి ఆదాయం ఏటేటే ప్రాతిపదికన 55 శాతం వృద్ధి చెంది గరిష్ఠంగా నమో దైంది. నూతన పటిష్ఠ బేస్ లైన్ తో కంపెనీ ఇప్పుడు తన నెట్ వర్క్ ను వేగవంతం చేసేందుకు సిద్ధంగా ఉంది. రాబోయే 3-5 ఏళ్లలో తన ఉనికిని 500 రెస్టారెంట్లకు పెంచుకునేందుకు సిద్ధంగా ఉంది. దీని విస్తరణ వ్యూహం, ఫ్యూచర్ స్టోర్స్, డ్రైవ్ త్రూస్, ప్రత్యేక టేక్ అవుట్ విండోస్ తో కూడిన స్టోర్స్ అనే పటిష్ఠ ఎక్స్ పీరియెన్స్ పోర్ట్ ఫోలియోతో దీని ఓమ్ని చానల్ వ్యూహానికి అనుగుణంగా ఉంది.
2021 డిసెంబర్ 31 తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలపై వెస్ట్ లైఫ్ డెవలప్ మెంట్ లిమిటెడ్ వైస్ చైర్మన్ శ్రీ అమిత్ జటియా మాట్లాడుతూ, ‘‘ఈ త్రైమాసికంలో మా పనితీరు పట్ల మేం ఎంతో సంతోషంగా ఉన్నాం. మరీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, కొన్ని కొవిడ్ సంబంధిత ఆంక్షలు ఉన్నప్పటికీ ఈ ఫలితాలను సాధించగలిగాం. మా పటిష్ఠ వ్యూహానికి ఇదొక నిదర్శనం. భవిష్యత్ హెచ్చుతగ్గులను తట్టుకునే సమర్థత దానికి ఉంది. మా వృద్ధి తదు పరి దశకు ఇది ఒక ముందుమాట లాంటిది. రాబోయే త్రైమాసికాల్లో మా వృద్ధిని వేగవంతం చేయడం, మా అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడం మాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు. ఈ త్రైమాసికం భారతదేశంలో మెక్ డొనాల్డ్ పాతికేళ్ల కార్యకలాపాలకు గుర్తుగా కూడా నిలిచింది. వెస్ట్ లైఫ్ డెవలప్ మెంట్ ఈ మైలురాయిని 25 యాక్ట్స్ ఆఫ్ హ్యాపీ క్యాంపెయిన్ తో వేడుక చేసుకుంటోంది. కస్టమర్లకు, సిబ్బందికి వారి ముఖాల పై చిరునవ్వులు విరబూసేలా 25 పెద్దా, చిన్న కార్యక్రమాలు చేపడుతోంది. ‘యాక్ట్స్ ఆఫ్ హ్యాపీ’లో ఒకటిగా కంపెనీ తన ఐకానిక్ మెక్ డొనాల్డ్స్ హ్యాపీ మీల్ ను మిక్స్ డ్ ఫ్రూట్ బేవరేజ్, ఒక కప్పు హాట్ ఫ్రెష్ కార్న్ అందించడం ద్వారా వేడుక చేసుకుంటోంది. మరో యాక్ట్ ఆఫ్ హ్యాపీ కింద ఈట్ క్వల్ ప్లాట్ ఫామ్ కు సంబంధించిన నూతన క్యాంపెయిన్ ను వెస్ట్ లైఫ్ ప్రారంభించనుంది. ఈట్ క్వల్ అనేది ఒక బర్గర్ ప్యాక్. పై భుజం చలనశీలత తక్కువగా ఉన్న వ్యక్తుల కోసం రూ పొందించబడింది. దీని వల్ల బర్గర్ ను పట్టుకోవడం, తినడం వారికి సులభమవుతుంది. వెస్ట్ లైఫ్ దక్షిణాదిలో తన మొదటి లోకల్ ఫేమస్ ఆర్డర్ ను తన ప్రచారకర్త రశ్మిక మందన్న తో ఈ త్రైమాసికంలోనే ప్రా రంభించింది. ఈ ప్రముఖ తార ప్రజాదరణను తన బ్రాండ్ రెలవెన్స్ ను పెంచుకునేందుకు కంపెనీ ఉపయోగించుకుంటోం ది. వినియోగదారుల్లో ఇది ఈ బ్రాండ్ ను దీర్ఘకాలం గుర్తుంచుకునేందుకు వీలు కల్పించేలా కొన్ని సంచలన కార్యక్రమా లు చేపట్టేందుకు దారి తీసింది.