Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భాగస్వామిని కనుగొనే విషయంలో సింగిల్ ఇండియన్స్‌కు డేటింగ్ ఉద్దేశాలు (66 శాతం) మరియు రాజకీయ మొగ్గులు (46శాతం) కీలకంగా ఉన్నాయి.
హైదరాబాద : గత రెండేండ్లుగా లాక్డౌన్లు, భౌతిక దూర పరిమితులతో మనం ఆన్లైన్లో కనెక్ట్ అవుతున్నాము. మరియు భాగస్వామిని గుర్తించే విషయంలో మనం వెతుకుతున్న విధానాలను మార్చాయి. వాలెంటైన్స్ డేకి ముందుగా, ఉమెన్-ఫస్ట్ డేటింగ్ యాప్ బంబుల్, 2022లో సింగిల్ ఇండియన్స్ కోసం డేటింగ్ డీల్ బ్రేకర్లను ఒక ప్రకటనలో వెల్లడించింది.
డేటింగ్ ఉద్దేశాలను స్పష్టం చేయండి
వారి కనెక్షన్లతో ఒకే పేజీలో ఉండేందుకు ఎవరు మాత్రం ఇష్టపడరు? సమీక్షకు స్పందించిన 66 శాతం సింగిల్ ఇండియన్స్‌కు, వారు 2022లో డేటింగ్‌కు వెళ్లినప్పుడు స్పష్టమైన డేటింగ్ ఉద్దేశాలు లేకుంటే డీల్ బ్రేకర్ కావచ్చు.
రాజకీయ మొగ్గుతో పొత్తుపెట్టుకున్నారు
భారతదేశంలోని జెన్ జడ్ మరియు యువ మిలీనియల్స్‌కు వారి రాజకీయ మొగ్గు మరింత కీలకంగా ఉంటుంది. బంబుల్ అధ్యయనం ప్రకారం, డేటింగ్ విషయానికి వస్తే, రాజకీయ ఒరవడితో సరిపెట్టుకోక పోవడం డీల్ బ్రేకర్ అవుతుంది. సమీక్షకు స్పందించిన సింగిల్ ఇండియన్స్‌లో 46శాతం మంది రాజకీయ అభిప్రాయాలు ఏకీభవించని వారితో తాము డేటింగ్ చేయమని స్పష్టం చేశారు.
టీకా తీసుకున్నారా లేదా తీసుకోలేదా
భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించడం భారతదేశంలో డేటర్లకు కీలక అంశంగా కొనసాగుతుంది. సర్వేలో పాల్గొన్న దాదాపు ముగ్గురిలో ఒకరు (27 శాతం) భారతీయులు కొవిడ్-సంబంధిత భద్రతా జాగ్రత్తలు మరియు ఆరోగ్య సమస్యల గురించి చర్చించకుండా డేట్‌కు వెళ్లకూడదని భావిస్తున్నారు మరియు 42 శాతం మంది ప్రజలు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారితో తాము డేటింగ్‌కు వెళ్లబోమని లేదా వారితో లైంగిక క్రియలో పాల్గొనబోమని స్పష్టం చేశారు.
మహమ్మారి సమయంలో డేటింగ్ గురించి సంభాషణలను సాధారంగా చేయడంలో మరియు మరింత మెరుగ్గా సులభం చేయడంలో సహాయపడేందుకు బంబుల్ ఒక కొవిడ్ ప్రాధాన్యతల కేంద్రాన్ని జోడించగా, దీన్ని బంబుల్ యాప్‌లోని ప్రొఫైల్ చిహ్నాన్ని నొక్కడం ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఎవరితోనైనా మ్యాచ్ అయిన తర్వాత, ఇద్దరు వ్యక్తులు అవతలి వ్యక్తికి సంబంధించిన డేటింగ్ ప్రాధాన్యతలను - ఆరుబయట లేదా రద్దీ లేని ప్రదేశాలలో మాత్రమే కలవడం - మరియు వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు తదితర అంశాలను వర్చువల్ విధానంలో మాత్రమే చూడగలరు.
'అర్ధవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకునేందుకు, మీరు ఎవరు మరియు మీకు ఏది ముఖ్యమైనది అనే దాని గురించి ప్రామాణికంగా ఉండటం ముఖ్యం. గత రెండేళ్ల నుంచి కొనసాగుతున్న లాక్డౌన్ పరిమితులు మరియు భౌతిక దూరానికి సంబంధించిన నిబంధనలు, మనం ఎవరితో, ఎప్పుడు మరియు ఎలా డేటింగ్ చేయాలనుకుంటున్నాము అనే విషయంలో మన డేటింగ్ ప్రాధాన్యతలు మరియు ఎంపికలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. ప్రజలు 2022లో రాజీ లేకుండా, వారికి ఉత్తమంగా పనిచేసే విధంగా డేటింగ్ చేయాలని కోరుకునే ఏడాదిగా కనిపిస్తోంది` అని బంబుల్ ఇండియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సమర్పిత సమద్దర్ వ్యాఖ్యానించారు.