Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడలోని బాలాజీ నగర్లో మొట్టమొదటి శాఖ ప్రారంభం
స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌గా ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎఫ్బీ బీ హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ ఎంఎఫ్, ఎస్బీఐ ఇన్సూరెన్స్ వంటి భారీ మదుపరులు వెన్నంటి ఉన్నారు
ఎస్ఎస్ఎఫ్బీ ఆకర్షణీయమైన వడ్డీరేట్లను అందిస్తుంది.
సేవింగ్స్ ఖాతాలపై 6.25 శాతం వడ్డీరేటు
సీనియర్ సిటిజన్లకు వడ్డీరేటును టర్మ్డిపాజిట్పై 7.30 శాతం అందిస్తున్నారు
హైదరాబాద్ : అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న చిన్న ఫైనాన్స్ బ్యాంక్‌లలో ఒకటైన సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎస్ఎఫ్బీ) తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను విజయవాడలో ప్రారంభించింది. కృష్ణలంకలోని బాలాజీనగర్‌లో నేడు తమ మొదటి శాఖను ప్రారంభించింది. ఈ శాఖను లెఫ్టినెంట్ కమాండర్ బీ ఎం రవీంద్రనాథ్ రెడ్డి (డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్ట్యూటివ్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్) మరియు శ్రీ వెంకటేశ్వర రెడ్డి (అధ్యక్షులుఉ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్) ప్రారంభించారు.
ఈ సందర్భంగా సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈవో భాస్కర్ బసు మాట్లాడుతూ 'సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రధానంగా బ్యాంకు కార్యకలాపాలు అందుబాటులో లేని మరియు అతి తక్కువ సేవలు అందుబాటులో కలిగిన వారిని సైతం ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడం పై దృష్టి కేంద్రీకరించింది. తాము ఎక్కడైతే కార్యకలాపాలు నిర్వహించడం లేదో ఆ రాష్ట్రాలలో ఉనికిని విస్తరిస్తున్నాం. ఈ క్రమంలో మా కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. మా మొదటి శాఖను విజయవాడలోని బాలాజీనగర్‌లో ఏర్పాటుచేశాము. అతి తక్కువ నిర్వహణ వ్యయాలు, విస్తృత స్థాయి వ్యాపార నమూనాలతో మా వినియోగదారులకు అత్యంత సరసమైన వడ్డీ రేట్లను డిపాజిట్లపై అందిస్తున్నాం` అని తెలిపారు.
ప్రస్తుతం సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై 6.25శాతం వడ్డీని అందిస్తుంటే, ఫిక్స్డ్ డిపాజిట్లపై 7శాతం వరకూ అందిస్తున్నది. సీనియర్ సిటిజన్లకు 7.3శాతం వరకూ వడ్డీ అందిస్తుంది. ప్రతినెలా సేవింగ్స్ ఖాతాలపై వడ్డీని క్రెడిట్ చేస్తుంది.