Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రీమియం మోటర్‌సైకిల్ వినియోగదారుల కోసం వైవిధ్యమైన రీతిలో లీనమయ్యే అనుభవాలు
ప్రత్యేక శ్రేణి ప్రీమియం మోటార్‌సైకిల్స్ (300 సీసీఉ500సీసీ)తో సవారీ ప్రియులకు ఆనందాన్ని అందించనుంది
హోండా బిగ్ బైక్స్ కోసం ప్రత్యేకమైన ఒన్ స్టాప్ సేల్స్ , సర్వీస్ కేంద్రం
రాజమండ్రి : హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఎంఎస్ఐ) నేడు తమ గో రైడింగ్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్తూ తమ ప్రీమియం బిగ్ బైక్ వ్యాపార విభాగం హోండా బిగ్‌వింగ్ ను రాజమండ్రి లో ప్రారంభించింది. (చిరునామా : డోర్ నెంబర్ 87-1-17/5, రెవిన్యూ వార్డ్-31, షెల్టన్ హోటల్ ఎదురుగా, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, అయ్యప్ప నగర్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, 533103)
రాజమండ్రిలో బిగ్‌వింగ్ ప్రారంభం గురించి హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ 'హోండా బిగ్‌వింగ్ (హోండా యొక్క ప్రత్యేకమైన ప్రీమియం మోటర్‌సైకిల్ నెట్వర్క్)ను వినియోగదారులకు వైవిధ్యమైన లీనమయ్యే అనుభవాలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించాము. నేడు, రాజమండ్రిలో బిగ్‌వింగ్‌ను తెరువడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఈ నూతన ప్రీమియం ఔట్లెట్ ద్వారా మేము, హోండా యొక్క వినోదాత్మక, ప్రీమియం మోటర్‌సైకిల్స్‌ను రాజమండ్రి లోని వినియోగదారులకు సన్నిహితంగా తీసుకురావడం లక్ష్యంగా చేసుకున్నాం. ఈ నూతన ప్రీమియం ఔట్లెట్ ద్వారా మా మిడ్ సైజ్ శ్రేణి మోటర్‌సైకిల్స్‌ను వారికి మరింత సన్నిహితంగా తీసుకురానున్నాం` అని అన్నారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా 80 నిర్వహణలోని బిగ్‌వింగ్ టచ్‌పాయింట్స్ ద్వారా వైవిధ్యమైన సిల్వర్ వింగ్స్ అనుభవాలను వినియోగదారులు పొందవచ్చు.
వైవిధ్యమైన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో
హోండా యొక్క ప్రీమియం మోటర్‌సైకిల్ రిటైల్ ఫార్మాట్‌కు అగ్రశ్రేణి మెట్రో నగరాలలో బిగ్ వింగ్ టాప్‌లైన్ మరియు ఇతర డిమాండ్ కేంద్రాలలో బిగ్‌వింగ్ నేతృత్వం వహిస్తున్నాయి. హోండా బిగ్ వింగ్ టాప్లైన్లో హోండా యొక్క సమగ్రమైన ప్రీమియం మోటర్‌సైకిల్స్ శ్రేణి ఉంది. దీనిలో సీబీ 350ఆర్, హైనెస్ సీబీ350 మరియు దీని వార్షికోత్సవ ఎడిషన్, సీబీ350ఆర్ఎస్, సీబీ500ఎక్స్, సీబీ650ఆర్, సీబీఆర్ 650ఆర్, సీబీఆర్ 1000ఆర్ఆర్ఉఆర్ ఫైర్‌బ్లేడ్ , సీబీఆర్ 1000 ఆర్ఆర్ఉఆర్ ఫైర్‌బ్లేడ్ ఎస్పీ మరియు అడ్వెంచర్ టౌరర్ ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ మరియు ప్రతిష్టాత్మకమైన మోడల్ గోల్డ్ వింగ్టూర్ ఉంటాయి. బిగ్వింగ్స్ ఇప్పుడు భారతదేశంలో మిడ్ సైజ్ మోటార్‌సైకిల్ అభిమానులకు ఆనందం కలిగించనుంది.
ప్రీమియం అనుభవాలు :
బ్లాక్ అండ్ వైట్ మోనోక్రోమాటిక్ నేపథ్యంతో ఆకట్టుకునేలా ఉన్న బిగ్‌వింగ్, తాము ప్రదర్శించే వాహనాలను పూర్తి వైభవంగా ప్రదర్శిస్తుంది. ఉత్పత్తికి సంబంధించి వినియోగదారులకు ఉన్న సందేహాలు తీర్చడం లేదా యాక్ససరీలను సుశిక్షితులైన, విజ్ఞానవంతులైన ప్రొఫెషనల్స్ బిగ్‌వింగ్ వద్ద అందిస్తారు. వెదకడం మొదలు కొనుగోలువరకూ ఈ ప్రయాణాన్ని సులభతరం చేస్తూ, పూర్తిగా అంకితం చేసిన వెబ్సైట్ www.HondaBigWing.in సవివరమైన సమాచారం అందిస్తుంది. వెబ్‌సైట్‌పై ఆన్లైన్ బుకింగ్ అవకాశం, వేగవంతమైన, సులభసాధ్యమైన, పారదర్శక బుకింగ్ అనుభవాలను వినియోగదారుల మునివేళ్లపై అందిస్తుంది. వాస్తవ సమయంలో వినియోగదారుల అభిప్రాయాలను ఒడిసిపట్టుకునేందుకు, హోండా బిగ్‌వింగ్ ఇప్పుడు అన్ని సామాజిక మాధ్యమ వేదికలపై లభ్యమవుతుంది.
వినియోగదారులకు భద్రత మరియు సౌకర్యానికి భరోసా అందిస్తూ, హోండా బిగ్‌వింగ్ ఇప్పుడు లీనమయ్యే డిజిటల్ అనుభవాలను తీసుకువస్తుంది. వర్ట్యువల్ వేదిక ద్వారా వినియోగదారులు పూర్తి వినోదాత్మక మోటర్‌సైకిల్ శ్రేణి, వైవిధ్యమైన శ్రేణి యాక్ససరీలు మరియు రైడింగ్ గేర్ సైతం సౌకర్యవంతంగా తమ ఇంటి వద్ద నుంచి పొందే అవకాశం అందిస్తుంది.
మమ్మల్ని ఇక్కడ చేరుకోండి :
బిగ్ వింగ్ రాజమహేంద్రవరం సెంట్రల్
షోరూమ్ మరియు వర్క్‌షాప్ : డోర్ నెంబర్ 87-1-17/5, రెవిన్యూ వార్డ్-31, షెల్టన్ హోటల్ ఎదురుగా, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, అయ్యప్ప నగర్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, 533103