Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో విద్యుత్ మొబిలటీ మరియు సేవలలో అగ్రగామి ఈటీఓ మోటర్స్ మరో కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని జోడిస్తూ తమ అత్యాధునిక ట్రైలక్స్ శ్రేణి మూడు చక్రాల విద్యుత్ వాహనాలను గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన రామానుజాచార్య స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ(సమతా మూర్తి విగ్రహం) ఆవిష్కరణ కార్యక్రమం వద్ద అందుబాటులో ఉంచింది. అత్యంత అందమైన ఈ క్యాంపస్ చుట్టూ యాత్రికులు ప్రయాణించేందకు అనువుగా ఇవి అందుబాటులో ఉంచారు.
,ఈటీఓ మోటర్స్ బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ వైఎస్ఆర్ మాట్లాడుతూ.. 'పర్యావరణం (ఎన్విరాన్మెంట్), సాధికారిత (ఎంపవర్మెంట్), ఉపాధి (ఎంప్లాయ్ంట్) అనే మూడు సిద్ధాంతాలపై ఈటీఓ మోటర్స్ పనిచేస్తుంటుంది. రామానుజాచార్య బోధనలకు అనుగుణంగా ఇది పనిచేస్తుంది. ప్రకృతిని రక్షించడంతో పాటుగా దీని వనరులు అయినటువంటి గాలి, నీరు, భూమి కాపాడటంతో పాటుగా సామాజిక సమానత్వంను ఆయన ప్రచారం చేశారు. ఈ ప్రాంతంలో 10వేల ఈవీ చార్జింగ్ పాయింట్లను రాబోయే ఐదేండ్లలో ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. ఈటీఓ మోటర్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా 30మెగా వాట్ల ఈవీ చార్జింగ్ మౌలికవసతులను ఏర్పాటు చేసింది మరియు బీఎస్ఈఎస్ మరియు టాటా పవర్ డీడీఎల్ తో భాగస్వామ్యం చేసుకుని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో స్మార్ట్ మరియు అందుబాటులోని చార్జింగ్ పరిష్కారాలను ఏర్పాటుచేసి భారతీయులు చార్జింగ్ మౌలిక వసతుల సవాళ్లను అధిగమించేందుకు తోడ్పడుతుంది. మేము 50 వాహనాలను కేవాడియా (గుజరాత్) వద్ద అందుబాటులో ఉంచడంతో పాటుగా భారతదేశంలో మొదటి 100% ఈవీ నగరంగా మార్చింది. 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించాలనే భారతదేశ లక్ష్యానికి మద్దతునందించాలనే కంపెనీ నిబద్ధతకు తోడ్పాటునందిస్తుంది`అని అన్నారు.