Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : త్వరలో రానున్న ఎల్ఐసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లో ఆ సంస్థ పాలసీదారులకు 5 శాతం రాయితీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపిఒ ప్రతిపాదన దస్త్రాలను ఫిబ్రవరి 10న రెగ్యూలేటరీ సంస్థలకు ఇచ్చే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. రిటైల్ విండో కింద పాలసీదారులకు నిర్దిష్ట రిజర్వేషన్ కింద డిస్కౌంట్ అందించడానికి కావల్సిన నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. పాలసీదారులకే కాకుండా సంస్ధ ఉద్యోగులకు కూడా రిజర్వేషన్ ఉంటుందన్నారు.