Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా తమ ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం ఐడీఎఫ్సీ నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. దీర్ఘకాలంలో సంపదను సృష్టించడమే లక్ష్యంగా దీనిని తీర్చిదిద్దినట్టు ఆ సంస్థ పేర్కొంది. ఈ ఇండెక్స్ ఫండ్‌తో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అగ్రగామిగా ఉన్న అతిపెద్ద 100 కంపెనీల నుంచి ప్రయోజనం పొందనున్నారని తెలిపింది. ఆర్ధిక సేవలు, సమాచార సాంకేతికత, చమురు, సహజవాయు, వినియోగదారుల ఉత్పత్తుల రంగాలలో పెట్టుబడి పెట్టవచ్చని తెలిపింది. ఈ నూతన ఫండ్ ఫిబ్రవరి 07 తెరుచుకుందని.. ఈ నెల 18తో ముగియనుందని వెల్లడించింది.