Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉపాధి, విస్తృతస్థాయి విద్యా పరిశోధన అవకాశాలు, విదేశీ విద్య కోసం విద్యార్థులను సన్నద్ధం చేయడం, ఉపాధ్యాయులకు నైపుణ్యాభివృద్ధి మరియు ఫ్యాకల్టీ మార్పిడి కార్యక్రమాలు సాధ్యమయ్యే అవకాశం
హైదరాబాద్ : కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ అండ్ ఎస్సెస్మెంట్ మరియు భారత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (బీహెర్)లాంఛనంగా ఓ అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా విద్యా పరిశోధన మరియు భాషా అభివృద్ధి కేంద్రంను ఆంగ్ల భాష కోసం ఏర్పాటుచేయనున్నారు. ఆసియా ఉపఖండంలో ఇది మొట్టమొదటిసారి. బీహెర్ మరియు అనుబంధ సంస్థల అధ్యాపకులు మరియు విద్యార్థుల కోసం విద్య మరియు పరిశోధన ప్రచురణ కార్యకలాపాలను ఈ కేంద్రం అన్వేషిస్తుంది.
ఈ ఒప్పందం కింద ఈ రెండు సంస్థల అత్యంత నాణ్యమైన అభ్యాస అంశాలు మరియు ఎస్సెస్మెంట్ను ప్రచురించడానికి పనిచేయడంతో పాటుగా విద్యార్థులు కోసం ఉద్యోగార్హత నైపుణ్యాల కోసం ధ్రువీకరణ, టీచర్ ట్రైనింగ్, ఉన్నత విద్య సంస్థలు, పాఠశాలల కోసం డిజిటల్ అభ్యాస పరిష్కారాలు కోసం పనిచేయనున్నాయి. దీనితో పాటుగా ఈ రెండు సంస్ధలకు చెందిన విద్యార్థులు మరియు విద్యావేత్తలకు కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ టెస్ట్ ను ఇంజినీరింగ్, హెల్త్‌కేర్, ఇతర విభాగాలలో అన్వేషించేందుకు సైతం తోడ్పడుతుంది.ఈ టెస్ట్‌ను ఇనిస్టిట్యూట్ యొక్క భాగస్వామి లాంచ్పాడ్ లెర్నింగ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహిస్తారు.
భారత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (బీహెర్) ఛాన్స్లర్ డాక్టర్ సందీప్ ఆనంద్ మాట్లాడుతూ.. 'కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ అండ్ ఎస్సెస్మెంట్ (సీయుపీఏ)తో మా భాగస్వామ్యం విద్యా పరిశోధన, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్‌లో బహుళ అంశాలపై ఆధారపడేందుకు మాకు తోడ్పడటంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా మా విద్యార్థులకు అవకాశాలు సృష్టించబడతాయి. నాలుగు దశాబ్దాలుగా నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలిచిన బీహెర్, ఇప్పుడు సీయుపీఏతో భాగస్వామ్యం చేసుకుని విద్యా పరిశోధన కోసం శ్రేష్టత కేంద్రం ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము` అని అన్నారు.
కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ అండ్ ఎస్సెస్మెంట్, సౌత్ ఆసియా ఎండీ, అర్జున్ రాజమణి మాట్లాడుతూ.. 'భాషా ఆధారిత విద్యా పరిశోధన కోసం అద్భుతమైన పర్యావరణ వ్యవస్ధను సృష్టించడంతో పాటుగా అంతర్జాతీయ సర్టిఫికేషన్లను పొందేందుకు విద్యార్థులకు సహాయపడే రీతిలో ఒక వేదికను అందించడానికి వారి ప్రేరణ, అవకాశాల ప్రపంచాన్ని సృష్టించగలదు` అని అన్నారు.