Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్ అండ్ ఎస్సెస్మెంట్తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీమ్డ్ యూనివర్శిటీ భారత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (బీహెర్) వెల్లడించింది. ఇందులో భాగంగా ఆంగ్ల భాష విద్యా పరిశోధన, భాషా అభివద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఆసియా ఉపఖండంలో ఇది మొట్టమొదటిదని బీహెర్ ఛాన్స్లర్ డాక్టర్ సందీప్ ఆనంద్ తెలిపారు. ఈ భాగస్వామ్యం విద్యా పరిశోధన, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్‌లో బహుళ అంశాలపై ఆధారపడేందుకు తమకు తోడ్పడనుందన్నారు.