Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ముందు నాటి స్థాయి కంటే గ్యాస్ సరఫరా ఎక్కువగా ఉందని గెయిల్ ఛైర్మెన్ మనోజ్ జైన్ తెలిపారు. సీఎన్జీ, వంట గ్యాస్ సరఫరా కోసం సిటీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించనున్నామన్నారు. ఏడాదికేడాదితో పోల్చితే గడిచిన డిసెంబర్ త్రైమాసికంలో గ్యాస్ సరఫరా 3.6 శాతం పెరిగి రోజుకు 114.3 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లుగా ఉందన్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో ప్రతీ ఏడాది ఇది 5-6 శాతం చొప్పున పెరుగొచ్చన్నారు. దేశ ఇంధన డిమాండ్‌ను చేరుకోవడానికి కొత్త ఒప్పందాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. ఇందుకోసం అమెరికా, ఆస్ట్రేలియా, రష్యాతో కాంట్రాక్టు సరఫరా భాగస్వామ్యాన్ని కుదుర్చుకోనున్నామన్నారు.