Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హౌసింగ్ డాట్ కామ్ అధ్యయనం
న్యూఢిల్లీ : దేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న వయోవృద్ధుల సంఖ్య కారణంగా రాబోయే మూడు దశాబ్దాలలో రిటైర్మెంట్ గృహాలకు డిమాండ్ పెరగనుందని హౌసింగ్ డాట్ కామ్ అధ్యయనంలో అంచనా వేసింది. భవిష్యత్తులో సీనియర్ లివింగ్ హౌసింగ్ అనేది అతి ముఖ్యమైన రెసిడెన్షియల్ ఆస్తి విభాగంగా మారే అవకాశం ఉందని విశ్లేషించింది. ఈ విభాగంలో ఉన్న అసాధారణ అవకాశాలను గుర్తించిన అనేకమంది రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఈ డిమాండ్‌ను ఓడీసీ పట్టుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారని వెల్లడించింది. ఇందుకోసం స్టాండలోన్ సీనియర్ లివింగ్ ప్రాజెక్టులను అభివద్ధి చేయడం లేదా అవసరమైన సదుపాయాలతో పూర్తిగా అంకితం చేసిన టవర్లను నిర్మించడం ప్రారంభించారని పేర్కొంది. సీనియర్ సిటిజన్లు ప్రస్తుతం రూ.1-2 కోట్ల రూపాయల శ్రేణి గహాల కోసం వెదుకుతున్నారని.. అయితే రూ.45 లక్షల లోపు రెండు పడక గదులకు డిమాండ్ భారీగానే ఉందని పేర్కొంది.