Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఏల కేటాయింపుల్లో పెరుగుదల
ముంబయి : భారత బ్యాంక్‌లపై మొండి బాకీల భారం పెరిగింది. వరుసగా రెండు త్రైమాసికాలుగా తగ్గిన మొండి బాకీల కోసం చేసే కేటాయింపులు.. 2021 డిసెంబర్‌తో ముగిసిన వారంలో అనుహ్యాంగా పెరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు అధికంగా ఒత్తిడికి గురైయ్యాయని తెలుస్తోంది. దీంతో ఇటీవల దేశ ఆర్థిక వ్యవస్థలో కొంత పురోగమనం ఉందని ఆశించిన వర్గాల్లో మళ్లీ ఆందోళన మొదలయ్యింది. గడిచిన 2021 డిసెంబర్ త్రైమాసికంలో 29 బ్యాంక్‌ల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) ఏడాదికేడాదితో పోల్చితే 9.7 శాతం పెరిగి రూ.31,891 కోట్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం త్రైమాసికంతో పోల్చితే 5.4 శాతం పెరుగుదల ఉంది. 2022 మార్చి త్రైమాసికంలో మరింత పెరుగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిసెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల ఎన్పీఏల కేటాయింపులు 19.4 శాతం ఎగిసి రూ.21,939.5 కోట్లుగా చోటు చేసుకున్నాయి. మొత్తం మొండి బాకీల కేటాయింపుల్లో పీఎస్‌బీల వాటా 68.8 శాతంగా చోటు చేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర పీఎస్‌బీల కేటాయింపుల కవరేజీ నిష్పత్తి (పీసీఆర్) 60-250 బేసిస్ పాయింట్లు పెరిగింది. ప్రయివేటు రంగ బ్యాంక్‌ల్లో కేటాయింపులు 3.9 శాతం పెరిగాయి. నికర వడ్డీపై ఆదాయం (ఎన్ఐఐ) ఏడాదికేడాదితో పోల్చితే 0.7 శాతం తగ్గి రూ.1.3 లక్షల కోట్లుగా నమోదయ్యింది. మరోవైపు పీఎస్‌బీల ఎన్ఐఐ 2.2 శాతం పెరిగింది. సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చితే 5 శాతం వృద్థి ఉండటం కొంత ఉపశమనం కల్పించే అంశం.