Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శాంసంగ్ నేడు గెలాక్సీ ఎస్22 అల్ట్రాను ఆవిష్కరించింది. రెండు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ వారసత్వాలను మిళితం చేయడంతో పాటుగా ఎస్ సిరీస్ యొక్క ప్రో గ్రేడ్ కెమెరా మరియు పనితీరు, నోట్ సిరీస్ యొక్క సాటిలేని శక్తిని మిళితం చేయడం ద్వారా ప్రీమియం స్మార్ట్ఫోన్లలో నూతన ప్రమాణాలను నిర్ధేశిస్తుంది. అంతర్గతంగా నిర్మించిన ఎస్–పెన్, అత్యాధునిక నైటోగ్రఫీ మరియు వీడియో సామర్థ్యం , బ్యాటరీ జీవితాన్ని ఇది కలిగి ఉంది. దీని బ్యాటరీ ఓ రోజంతా పనిచేయడం వల్ల గెలాక్సీ ఎస్ 22 అలా్ట్ర ఇప్పుడు శాంసంగ్ సృష్టించిన అత్యంత శక్తివంతమైన అల్ట్రా ఉపకరణంగా నిలుస్తుంది.
‘‘శాంసంగ్ వద్ద మేము స్థిరంగా మా ప్రీమియం ఉపకరణాల ద్వారా ఆసక్తిని రేకెత్తిస్తుంటాము’’ అని టీఎం రో, అధ్యక్షులు మరియు హెడ్ ఆఫ్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ , ఎంక్స్ (మొబైల్ ఎక్స్పీరియన్స్) బిజినెస్ అన్నారు. ‘‘గెలాక్సీ ఎస్ 22 అలా్ట్ర ఇప్పుడు ఎక్కువ మంది అభిమానించే గెలాక్సీ నోట్ పనితీరు మరియు ఎక్కువ మంది వేడుక చేసే ఎస్ సిరీస్ అంశాలను కలిగి ఉన్నాయి. ఇది పూర్తి వినూత్నమైన మొబైల్ అనుభవాలను అందిస్తుంది. మొబైల్ సాంకేతికత పరంగా ఇది అత్యున్నతం కావడంతో పాటుగా స్మార్ట్ఫోన్లలో నూతన ప్రమాణాలను సైతం ఏర్పరుస్తుంది’’ అని అన్నారు.
శాంసంగ్ ఇప్పుడు గెలాక్సీ ఎస్ 22 మరియు ఎస్ 22+ను విడుదల చేసింది. ఈ రెండు ప్రతిష్టాత్మకమైన ఉపరణాలు సృజనాత్మకత మరియు స్వీయ వ్యక్తీకరణకు తోడ్పడతాయి. గెలాక్సీ ఎస్ 22 మరియు ఎస్ 22+లు శక్తివంతమైన కెమెరాలను అత్యాధునిక ఇంటిలిజెంట్ ఇమేజ్ ప్రాసెసింగ్‌ను పరిచయం చేశాయి. ఇవి ప్రతి క్షణాన్నీ అద్భుతంగా మలుస్తాయి. గెలాక్సీ ఎస్22 మరియు ఎస్22+లను అత్యంత అందంగా మరియు పూర్తి పర్యావరణ స్పృహతో తీర్చిదిద్దారు. గెలాక్సీ ఎస్ 22 అలా్ట్రతో మీరు ఎలాంటి కాంతి పరిస్థితులలో అయినా తక్షణమే విలువనందించే ఫుటేజ్‌ను ఒడిసిపట్టవచ్చు. అత్యాధునిక నైటోగ్రఫీ ఫీచర్లు మొత్తం ఎస్ 22 కుటుంబపు ఉపకరణాలలో లభ్యమవుతాయి. ఈ కారణం చేత మీరు ఆకట్టుకునే రీతిలో స్పష్టమైన వీడియోలను ముందు మరియు వెనుక కెమెరాలతో తీయవచ్చు. మీరు పగలు లేదా రాత్రి సమయాల్లో రికార్డింగ్ చేసినప్పటికీ ఈ అనుభవాలను మీరు సొంతం చేసుకోవచ్చు. దీనిలోని జూమింగ్ సామర్ధ్యంతో మీరు 100 రెట్లు దగ్గరగా యాక్షన్ చూడవచ్చు. గెలాక్సీ ఎస్22 అలా్ట్ర కేవలం శాంసంగ్ యొక్క అత్యంత శక్తివంతమైన కెమెరా మాత్రమే కాదు ఇది స్మార్టెస్ట్ గా ఉంటుంది.
మొదటి గెలాక్సీ ఎస్ సిరీస్‌లో భాగంగా ఎస్ 22 అలా్ట్ర ఉంటుంది. దీనిలో అత్యాధునికమైన 4ఎన్ఎం ప్రాసెసర్ ఉంటుంది. ఇది శాంసంగ్ యొక్క అత్యాధునిక ఏఐ మరియు ఎంఎల్ ప్రాసెసింగ్ ఉంది.
వినియోగదారులకు వీలైనంతగా అత్యుత్తమ మొబైల్ అనుభవాలను మరియు పనితీరును అందించాలనే మా నిబద్ధతలో భాగంగా, మా మొత్తం గెలాక్సీ ఎస్ 22 సిరీస్‌కు మా నాలుగు తరాల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్ మద్దతునందిస్తున్నాయి. గెలాక్సీ ఎస్ 22 సిరీస్‌కు శాంసంగ్ యొక్క అత్యంత శక్తివంతమైన నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ వేదిక మద్దతునందిస్తుంది. తద్వారా అత్యంత సున్నితమైన డాటా అయిన పాస్వర్డ్స్, బయోమెట్రిక్స్ లేదా బ్లాక్‌చైన్ కీస్ వంటివి ఫోన్ యొక్క ప్రధాన ఆపరేటింగ్ వ్యవస్ధకు మద్దతునందిస్తుంది. గెలాక్సీ ఎస్22 సిరీస్ ఒన్ యుఐ ప్రైవసీతో వస్తుంది. దీనిద్వారా ఏ ఆప్ మీ డాటా మరియు కెమెరా ఉపయోగించుకుంటుందనేది అతి సులభంగా చూడవచ్చు. అందువల్ల, మీరు ప్రతి యాప్‌కు అనుమతి మంజూరు చేయడం లేదా తిరస్కరించడం చేయవచ్చు.