Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అసిక్స్ నేడు జెల్ నింబస్ 24 రన్నింగ్ షూ విడుదల చేసినట్లు వెల్లడించింది. ఇది అత్యాధునిక మరియు ఇంపాక్ట్ రక్షణను అందించే నూతన తరహా అసిక్స్ సాంకేతికతను పరిచయం చేస్తుంది. నూతన మరియు మెరుగైన రీతిలో పాదాల కింద సౌకర్యం అందించే రీతిలో డిజైన్చేయబడిన జెల్ నింబస్ 24 షూ , ఎఫ్ఎఫ్ బ్లాస్ట్ ప్లస్ సాంకేతికతను కలిగిన మొట్టమొదటి జెల్ నింబస్. నూతనంగా ఆవిష్కరించిన ఆసిక్స్ సాంకేతికత ఎఫ్ఎఫ్ బ్లాస్ట్ టెక్నాలజీ. ఈ సాంకేతికత కారణంగా తమ ముందు తరపు షూస్‌తో పోలిస్తే 20 గ్రాములు తేలికగా ఉంటుంది. అదే సమయంలో మరింత శక్తిని బొటనవేలికి అందిస్తూనే ప్రతి అడుగూ సురక్షితంగా ఉండేందుకు తోడ్పడుతుంది. షూ పై భాగంలోని మృదువైన ఇంజినీర్డ్ మెష్, సౌకర్యవంతమైన మిడ్ ఫుట్ ప్యానెల్ ఈ షూను మరింత శ్వాసించతగిన రీతిలో మలచడంతో పాటుగా దీర్ఘకాలంలో మరింత సౌకర్యం అందిస్తుంది. పాదముతో పాటుగా ఎలాంటి అసౌకర్యం లేకుండా ముందుకు వెళ్లడం ద్వారా ఈ ఫీచర్లు ప్రతి ఒక్క అడుగూ సున్నితమైన అనుభూతులను పొందేందుకు తోడ్పడతాయి. ఇతర ఫీచర్లలో నిట్టెడ్ టంగ్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇది పాదాన్ని అతి సౌకర్యవంతంగా చుట్టుకోవడంతో పాటుగా మృదువైన మరియు మరింత మద్దతుకలిగించే అనుభూతిని అందిస్తుంది. అసిక్స్ లైట్ రబ్బర్ ఔట్సోల్ మెటీరియల్ వినియోగించారు. ఇది తేలికగా ఉండటంతో పాటుగా స్టాండర్డ్ ఔట్సోల్ మెటీరియల్‌తో పోలిస్తే మరింత శక్తివంతంగా ఉంటుంది. ఇది మన్నిక పెంచడంతో పాటుగా రాపిడి లేకుండానూ ఉంటుంది. అసిక్స్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, పెర్ఫార్మెన్స్, రన్నింగ్ ఫుట్‌వేర్ జనరల్ మేనేజర్ తొమోహిరో నాగస్యూ మాట్లాడుతూ ‘‘ అసిక్స్ వద్ద మేము రన్నర్లకు అత్యున్నత స్ధాయి ప్రదర్శన, రక్షణను అందించేందుకు కట్టుబడి ఉన్నాము. అందువల్ల వారు కదలికలకు సంబంధించి ఉత్తేజకరమైన ప్రయోజనాలను స్వేచ్ఛగా అనుభవించగలరు. తేలికపాటివే అయినప్పటికీ మన్నికైన జెల్ నింబస్ 24 షూ అనేది అసిక్స్ నుంచి వచ్చిన అత్యాధునిక షూ. ఎఫ్ఎఫ్ బ్లాస్ట్ ప్లస్ సాంకేతికతను ఇది కలిగి ఉండటం వల్ల ఈ షూ ధరించిన వారు మరింత సజావుగా, కష్టపడకుండా కదలటానికి వీలు కల్పిస్తుంది. అసిక్స్ ఇండియా అండ్ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ రజత్ ఖురానా మాట్లాడుతూ ‘‘అసిక్స్ వద్ద మేము వినియోగదారుల జీవితాలలో పూర్తి పరివర్తక అనుభవాలను మా ఆఫరింగ్స్ వ్యాప్తంగా ఆవిష్కరణలు మరియు సాంకేతికతలను జోడించడం ద్వారా తీసుకురావాలనుకుంటున్నాము. జెల్–నింబస్ 24 అనేది తేలికపాటి ఆవిష్కరణ. ఇది రన్నర్‌కు సౌకర్యం అందించడంతో పాటుగా గతంలో ఎన్నడూ లేని సౌకర్యం అందిస్తుంది. డిజైన్ పరంగా మా ఫ్యూచరిస్టిక్ విధానం అత్యున్నత ఉత్పత్తులను రూపొందించడంలో మాకు సహాయపడుతుంది మరియు రాబోయే సంవత్సరాలలో మా లక్ష్యానికి కట్టుబడి క్రీడలు మరియు శక్తికి ఓ ఆకృతిని రూపొందించడం కొనసాగించాలని ఆశిస్తున్నాము’’ అని అన్నారు. జెల్నింబస్ 24 రన్నింగ్ షూ లు స్త్రీ, పురుషులు ఇరువురికీ అసిక్స్ రిటైల్ మరియు ఆన్లైన్ స్టోర్లు మరియు వెబ్సైట్ ద్వారా ఫిబ్రవరి 10,2022 నుంచి 14,999 రూపాయల ధరలో లభిస్తాయి. జెల్ నింబస్ 24 మరియు ఎఫ్ఎఫ్ బ్లాస్ట్ ప్లస్టెక్నాలజీ గురించి మరింతగా తెలుసుకునేందుకు asics.com.. చూడండి.