Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : లహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఫార్-రీచింగ్ పరిణామాన్ని చూపించే తన నిబద్ధతను పునరుశ్ఛరణ చేస్తూ, అగ్రగామి సామాజిక పరిణామాన్ని చూపించే కార్యక్రమం ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ (EFA) ప్రారంభించి ఏడాది పూర్తి చేసి కొత్త మైలు రాయిని చేరుకున్నామని బైజూస్ ప్రకటించింది. ఒకే ఏడాదిలో ఈ కార్యక్రమం 26 రాష్ట్రాల్లోని మరియు 340+ జిల్లాల్లోని 3.4 మిలియన్ విద్యార్థులకు చేరుకోగా, వారికి సాంకేతిక-ప్రేరిత విద్యను చౌకగా, సమానంగా మరియు అందరికీ లభించేలా చేసింది. ఈ మహోన్నతమైన ఒక ఏడాది వార్షికోత్సవం సందర్భంలో బైజూస్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ఈ కార్యక్రమం ప్రారంభంలో 2025 నాటికి 5 మిలియన్ల బాలలకు ఉన్నతమైన నాణ్యత అభ్యాస ప్రక్రియతో సాధికారత కల్పించే లక్ష్యంతో దాన్ని 10 మిలియన్ బాలలకు విస్తరించనుంది. బైజూస్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ మొదటి నుంచీ తన భాగస్వామ్యులైన ఎన్జీఓల ద్వారా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు అలాగే నగరాల్లోని మురికివాడల్లోని బాలలకు బైజూస్ ఉచిత స్ట్రీమింగ్ లైసెన్స్ ద్వారా చదువుకునేందుకు సమానమైన అవకాశాలను కల్పిస్తోంది. ఇది దేశ వ్యాప్తంగా డిజిటల్ డివైడ్‌ను నివారించే లక్ష్యాన్ని కలిగి ఉండగా, విద్యార్థులకు తగిన వనరుల సహకారంతో సాధికారత కల్పించేందుకు మరియు డిజిటల్ లెర్నింగ్‌కు సమగ్ర వ్యవస్థను రూపొందిస్తుంది. ఇఎఫ్ఎకు ఎన్జీఓ భాగస్వాములు మరియు ఆన్-గ్రౌండ్ ఫెసిలిటేటర్ల ద్వారా విద్యార్థులు ఇప్పుడు బైజూస్ యాప్‌ను ప్రాథమిక లెర్నింగ్ మోడల్‌గా వినియోగించుకోవచ్చు. ఈ ప్రయత్నంతో బాలల్లో ఈ యాప్‌ను వినియోగించుకునేందుకు గమనార్హమైన క్రియాశీలత మరియు ఆకర్షణను కల్పించింది. అంతే కాకుండా బైజూస్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కార్యక్రమంలో 50% మేర లబ్ధిదారులు ఆడపిల్లలు ఉన్నారు. కెపిఎంజి (SROI method) ప్రారంభిక అధ్యయనం ప్రకారం 75% మంది రోజుకు సగటున 1 గంట ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు.