Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎస్యూ రుణాలు, డిపాజిట్లలో మొదటి స్థానం
హైదరాబాద్ : ఇటీవలి ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎమ్) చక్కటి ప్రదర్శన కనబర్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలు, సేవింగ్ డిపాజిట్ల విషయంలో మొదటి స్థానంలో నిలిచింది. 2021-22 అక్టోబర్-డిసెంబర్లో 1,29,006 కోట్ల తో గ్రాస్ అడ్వాన్సుల్లో 22.9 శాతం వృద్ధి సాధించినట్టు బ్యాంకు ప్రకటించింది. ఇక రుణాల విషయంలో బీఓఎమ్ తర్వాత కెనరా బ్యాంకు రెండో స్థానంలో ఉన్నది. రిటైల్, అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ విభాగంలో బ్యాంకు 18.06 శాతం అధిక వృద్ధితో రూ. 75,927 కోట్లతో చక్కటి ప్రతిభన కనబర్చింది. సేవింగ్ డిపాజిట్లలో 18.33 శాతం వృద్ధితో రూ. 80,815 కోట్లుగా ఉన్నది. ఆ తర్వాతి స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లు ఉన్నాయి. ఎస్బీఐ సేవింగ్ డిపాజిట్లు బీఓఎంతో పోల్చుకుంటే 18 రెట్లు అధికంగా రూ. 14,73,506 కోట్లుగా ఉన్నది. డిసెంబర్లో ముగిసిన మూడో త్రైమాసికానికి బీఓఎమ్ అగ్రిగేట్ నెట్ ప్రాఫిట్ గతంతో పోల్చుకుంటే పెరిగింది. అది రూ. 325 కోట్లకు చేరుకున్నది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ (ఎన్ఐఐ) 17 శాతం పెరిగి రూ. 1527 కోట్లకు చేరింది.