Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాదుకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు తెలంగాణ లోని పటాన్చెరులో తమ రెండవ ఫ్యాక్టరీని తెరవడం ద్వారా తమ తయారీ సామర్ధ్యాన్ని విస్తరించింది. కొత్త తయారీ సదుపాయాన్ని జోడించడం ద్వారా, ఈ సంస్థ తమ తయారీ సామర్ధ్యాన్ని సంవత్సరానికి 25,000 నుంచి గరిష్టాంగా 3,50,000 వరుకు పెంచింది.ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాదులోని పటాన్చెరులో తమ మొట్టమొదటి ఫ్యాక్టరీని 2020 సంవత్సరంలో ప్రారంభించింది. పటాన్చెరులోని కొత్త ఫ్యాక్టరీ ఆటమ్ సోలార్ రూఫ్ తో పనిచేసే మొదటిరకం ఫ్యాక్టరీ, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి విద్యుచ్ఛక్తి తయారుచేసే పైకప్పు, కలిగివున్న ఫ్యాక్టరీ మరియు ఈ ఫ్యాక్టరీ మొత్తం నెట్ జీరో తయారీ సదుపాయంతో నిరంచబడినది.
20,000 చదరపు అడుగులకి పైగా విస్తరించి ఉన్న ఈ కొత్త ఫ్యాక్టరీ, లో-స్పీడ్ న్యూ జనరేషన్ ఎలక్ట్రిక్ బైక్ అయిన ఆటమ్ 1.0 మరియు దాని తదుపరి మోడళ్లను రాబోయే నెలల్లో అందుబాటులోకి తెచ్చే బాధ్యత వహిస్తుంది. కొత్త ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో, ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆలోచన చేసిన వ్యక్తి, ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వంశీ గడ్డం గారు మాట్లాడుతూ ఇలా అన్నారు. “ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ సామర్ధ్యం పెంచడం కంపెనీ యొక్క గ్రీన్ ఇనిషియేటివ్ ని ముందుకి తీసుకువెళ్లడానికే కాకుండా భారతదేశం స్థిరమైన, పర్యావరణ సంరక్షణ బాధ్యత గల దేశంగా ఎదగడంలో దోహదపడుతుంది. గత సంవత్సరం(2021) లో 2.30 లక్షల లో-స్పీడ్ మరియు హై-స్పీడ్ గణాంకాల్ని అందుకుంటూ ఎలెక్ట్రిక్ టూవీలర్ మార్కెట్ 135% పెరిగింది. పేమ్ 2 సబ్సిడీ మరియు ఇంధన ధరల పెంపు వల్ల ఈ.వీ ల అమ్మకాలు బాగా పెరిగినందున, ఈ సంవత్సరం (2022) ఈ.వీ ల గణాంకాలు 6 లక్షల యూనిట్లకి చేరుతాయని అనుకుంటున్నాం. హై-స్పీడ్ వాహనాలకు మార్కెట్లో ఉన్న అధిక డిమాండ్ మేరకు, కొన్ని నెలల వ్యవధిలో మేం 50 కిలోమీటర్ల వేగ సామర్ధ్యంతో ఆటమ్ 1.1 మరియు 70 కిలోమీటర్ల వేగ సామర్ధ్యంతో ఆటమ్ 2.2 లను తీసుకురాబోతున్నాం. అంతేకాకుండా రాబోతున్న మొడ్డళ్ళతో ఈ సంవత్సరం(2022) మార్కెట్ షేర్ 5% ఆవుతుందని అంచనా వేస్తున్నాం.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా తీసుకురావడం మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన కారణంగా, ఈ.వీ టూ వీలర్ మార్కెట్ 2030 కల్లా పెట్రోల్ తో నడిచే వాహనాలను 50% మేరకు తగ్గిస్తుందని అంచనా. ప్రస్తుతం పెట్రోల్ తో నడిచే టూ వీలర్ మార్కెట్ సంవత్సరానికి 1.5 కోట్లు దాకా ఉంది. ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ పెరుగుదలని బట్టి, 2వ ప్లాంట్ ప్రారంభించడం ద్వారా మేము మా వార్షిక తయారీ సామర్ధ్యాన్ని 3 లక్షలకు పెంచుతున్నాం. ఆటోమొబైల్ప్రైవేట్ లిమిటెడ్ లో, భవిష్యత్తులో అన్ని వయస్సులవారికి సరిపోయేవిధంగా అత్యంత మెరుగైన ఎలక్ట్రిక్ వాహనాల్ని తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం.” ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలోనే మొట్టమొదటిసారి వినియోగదారుల కోసం డోర్ స్టెప్ బైక్ డెలివరీ ప్రారంభించిన కంపెనీ, అంతేకాకుండా ఇటీవలే ఇంటి వద్దే బైకు రిపేర్లు చేసే సర్వీస్ ఆన్ వీల్స్ ప్రారంభించింది. వారి మొట్టమొదటి బైక్ మోడల్, ఆటమ్ 1.0 ధర Rs 54999(పన్ను మినహాయించి). దీని అత్యధిక వేగం గంటకి 25 కిలోమీటర్లు కాబట్టి దీనికి లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరంలేదు. అందువల్ల దీన్ని 16 సం. ఆపైన ఏ వయస్సు వారైనా నడపవచ్చు. ఇది కాక ఈ బైక్ లోని కొన్ని ప్రత్యేకతలు 48V 250W మోటార్, 3-పిన్ పోర్ట్రబుల్ బ్యాటరీ మరియు 14-లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంది.
ఆటోమొబైల్ గురించి
ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ వంశీ గడ్డం గారి ఆలోచనలోంచి వచ్చిన ముత్యం. పైన చెప్పినట్టు స్థిరమైన వాహనాల తయారీ ధ్యేయంగా, ఆటోమొబైల్దేశమంతటా ఈ-మొబిలిటీకి మద్దతుగా వివిధ రకాల ఈ-బైకులు, స్కూటర్లను అందుబాటులోకి తీసుకురావడానికి చూస్తుంది. ఆ ఆటోమొబైల్ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో రూపొందించబడింది, 90% “భారత దేశం లోనే తయారైన విడి భాగాలతో, భారతదేశంలోనే,” ప్రత్యేకంగా భారత దేశపు రోడ్లకి అనువుగా ఉండేందుకు తాయారుచేయబడింది. వాడడానికి సులువుగా ఉండేలా తాయారుచేయబడింది, ఇంధన వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వైపు వెళ్లే దారిని సులువుతరం చెయ్యడానికి మేము కృషి చేస్తున్నాం. మీ అవసరాల్ని బట్టి మీ ప్రయాణం ఉంటుందని మేము అర్ధం చేసుకున్నాం, ఆటోమొబైల్ పర్యావణ రక్షణకి స్నేహపూర్వకమైన ప్రయాణాన్ని ఇవ్వగలదు.
మరిన్ని వివరాలకై ఈ వెబ్సైట్ చుడండి - https://www.atumobile.co/