Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంతో పాటుగా జీసీసీలో అతి పెద్ద ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ ప్రదాతలలో ఒకరైన అస్టర్ డీఎం హెల్త్‌కేర్ నేడు డిసెంబర్31,2021తో ముగిసిన త్రైమాసానికి తమ ఆర్ధిక ఫలితాలు వెల్లడించింది. నిర్వహణ ఆదాయం ఇయర్ ఆన్ ఇయర్ 19% వృద్ధి చెంది 2650 కోట్ల రూపాయలకు చేరగా, ఎబిట్డా ఇయర్ ఆన్ ఇయర్ 22% వృద్ధి చెంది 409 కోట్ల రూపాయలకు చేరింది. ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ ఫౌండర్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అజాద్ మూపెన్ ఈ ఫలితాలను గురించి మాట్లాడుతూ ఆస్టర్ ఇండియా వృద్ధి వ్యూహంలో భాగంగా పలు ప్రాజెక్టులను చేపట్టినట్లు తెలిపారు. కాలికట్లో 300 పడకల మదర్ హాస్పిటల్‌ను తీర్చిదిద్దుతున్నామని 2023 ఆర్ధిక సంవత్సర తొలి త్రైమాసంలో 140 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. కేరళలోని కాసర్‌గడ్‌లో 200 పడకల మల్టీస్పెషాలిటీ టెరిషయరీ కేర్ గ్రీన్ ఫీల్డ్ హాస్పిటల్‌ను రాబోయే రెండేళ్లలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆస్టర్ ల్యాబ్స్, డయాగ్నోస్టిక్స్వర్టికల్ను విస్తరించేందుకు ప్రణాళిక చేశామన్నారు. అస్టర్ డిజిటల్ హెల్త్ ప్రయాణం గురించి ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అలీషా మూపెన్ మాట్లాడుతూ ప్రణాళిక చేసిన రీతిలోనే తమ డిజిటల్ ప్రయాణం కొనసాగుతుందన్నారు. తమ యాప్ 1 ఆస్టర్ అతి ప్రధానమైన ఓమ్నీ ఛానెల్ మార్గంగా ఉందంటూ ఈ త్రైమాసంలో తమ 1.1 వెర్షన్ విడుదల చేయనున్నామన్నారు.