Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్‌ను మరో ఐదేండ్లు కొనసాగించేలా ఆ కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన బోర్డు మీటింగ్‌కు రతన్‌టాటా ప్రత్యేకంగా హాజరయ్యారు. 58 ఏళ్ల చంద్రశేఖరన్ పనితీరు, టాటా గ్రూపు ప్రగతిపై రతన్ టాటా సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పటికే ఐదేండ్లుగా ఈ హౌదాలో పని చేస్తున్న చంద్రశేఖరన్‌ను పదవీని కొనసాగించడానికి బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరో దఫా తనకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో విమానయానం, స్టీల్, డిజిటల్ రంగాల్లో చంద్రశేఖరన్ కొత్త విలీనాలు, వ్యాపారాలను సాధించారు.