Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వాణిజ్య మైనింగ్ కోసం దేశంలో ఇప్పటి వరకు 42 బొగ్గు గనులను వేలం వేశామని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మూడో దఫాలో భాగంగా ప్రస్తుత వారంలోనే 10 గనులను వేలం వేసినట్లు తెలిపింది. ఇవన్నీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే విక్రయించినవి కావడం గమనార్హం. ఈ 42 బొగ్గు గనుల్లో ఏడాదికి 86,404 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని పేర్కొంది. ప్రస్తుత వారంలో విక్రయించిన 10 బ్లాక్‌ల ద్వారా ఏడాదికి రూ.2,858.20 కోట్ల రెవెన్యూ సమకూరనుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.