Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రేడింగ్‌పై నిషేధం
ముంబయి : స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేయకుండా అనీల్ అంబానీపై రెగ్యూలేటరీ సంస్థ సెబీ నిషేధం ప్రకటిస్తూ ఆయనకు భారీ షాక్ ఇచ్చింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, దాని ప్రమోటర్ పారిశ్రామికవేత్త అనీల్ అంబానీలు సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకం లేదా ఒప్పందాలు చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. అనీల్‌తో పాటుగా మరో ముగ్గురు అమిత్ బప్నా, రవీంద్ర సుధాకర్, పింకేశ్ ఆర్‌షాపై కూడా మూడ నెలల పాటు నిషేధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిబంధనలకు విరుద్దంగా 13 సంస్థలకు నిధులను మళ్లించారనే ఆరోపణలతో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.