Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేసిన ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (IndiaFirst Life) నేడు ఇండియాఫస్ట్ లైఫ్ ఫార్చ్యూన్ ప్లస్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఇది నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్స్ లైఫ్‌కు, పరిమిత ప్రీమియం సేవింగ్స్ ప్లాన్ కాగా, మీ జీవితంలో ఎదురయ్యే అవసరాలకు సమగ్రమైన మరియు దీర్ఘకాలిక భద్రతా వలయాన్ని అందించే దిశలో రూపొందించారు. ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ డిప్యూటీ సీఈఓ రుషబ్ గాంధీ మాట్లాడుతూ, “మా వినూత్నమైన ప్రొడక్ట్ సూట్లో ఇండియాఫస్ట్ లైఫ్ ఫార్చ్యూన్ ప్లస్ ప్లాన్ మొదటి ‘క్యాష్ బోనస్’ ప్లాన్. మా #CustomerFirst సిద్ధాంతానికి అనుగుణంగా, మా వినియోగదారులకు నగదు బోనస్‌లను ఎన్‌క్యాష్ చేసుకునే సౌలభ్యాన్ని ఈ ప్లాన్ అందిస్తుంది. ప్రత్యామ్నాయంగా, వినియోగదారులు ఈ బోనస్‌లనూ కూడబెట్టుకోవచ్చు అలాగే వాటిపై అదనపు వడ్డీని పొందవచ్చు. పాలసీ వ్యవధిలో అదనపు లిక్విడిటీని కలిగి ఉండే ఎంపికను కలిగి ఉండాలనుకునే వారికి ఈ ఉత్పత్తి ప్రత్యేకంగా సరిపోతుంది’’ అని వివరించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనస్ రంజన్ బిస్వాల్ మాట్లాడుతూ, “ఇండియాఫస్ట్ లైఫ్ మా వినియోగదారుల కోసం పలు రకాల సంపూర్ణ జీవిత బీమా ఉత్పత్తులను అందిస్తోంది. ఇండియాఫస్ట్ లైఫ్ ఫార్చ్యూన్ ప్లస్ ప్లాన్‌తో, మా వినియోగదారులు పాలసీ వ్యవధిలో లైఫ్ కవర్ ప్రయోజనాలను, గ్యారెంటీ సర్వైవల్ బెనిఫిట్ మరియు క్యాష్ బోనస్‌లను పొందుతారు. పిపిటి తర్వాత ప్రారంభమయ్యే మనుగడ ప్రయోజనాలను కూడగట్టుకునే సౌలభ్యాన్నీ వారు కలిగి ఉంటారు మరియు దానిపై అదనపు వడ్డీని పొందుతారు. ఇండియాఫస్ట్ లైఫ్ ఫార్చ్యూన్ ప్లస్ ప్లాన్ మా #CustomerFirst సిద్ధాంతానికి అనుగుణంగా వారి అవసరాలను తీర్చడంలో మా నిబద్ధతను ప్రతిధ్వనిస్తుంది’’ అని పేర్కొన్నారు. ఇండియాఫస్ట్ లైఫ్ ఫార్చ్యూన్ ప్లస్ ప్లాన్ సాధారణ ఆదాయం ద్వారా జీవితంలోని హఠాత్తుగా వచ్చే అవసరాలను పరిష్కరించేందుకు లైఫ్ కవర్ మరియు పొదుపు, ఈ రెండింటి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 01 నెల నుంచి 60 ఏళ్ల వయస్సు వారికి అందుబాటులో ఉంటుంది అలాగే, గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 80 ఏళ్లు. వ్యక్తులు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన ప్రీమియం చెల్లించవచ్చు. ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన వెంటనే సర్వైవల్ బెనిఫిట్ ప్రారంభమవుతుంది. వినియోగదారులు తమ పాలసీకి ప్రీమియం రైడర్‌ను మినహాయించే ఎంపికను కూడా కలిగి ఉండడంతో, భవిష్యత్తులో ప్రీమియాలను చెల్లించే భారం నుంచి తమ ప్రియమైన వారిని సురక్షితంగా ఉంచుకోవచ్చు. సంప్రదాయక రివర్షనరీ బోనస్‌ల తరహాలో కాకుండా, పాలసీలో కలిసిపోయి, సాధారణంగా మెచ్యూరిటీ / డెత్ / సరెండర్ బెనిఫిట్‌తో పాటు చెల్లిస్తారు అలాగే, పాలసీ వ్యవధిలో మీ బోనస్‌లను ఎన్‌క్యాష్ చేసుకునేందుకు ఈ ప్రొడక్ట్ మిమ్మల్ని అనుమతిస్తుంది.
ఇండియాఫస్ట్ లైఫ్ వినియోగదారులకు 45 అవసరాల ఆధారిత ఆఫర్ల (ఉత్పత్తులు & రైడర్లు) అందించడం, బహుళ పంపిణీ సామర్థ్యాలను పెంచడం మరియు వివిధ పెట్టుబడి ఎంపికలను పెంపొందించడం తదితర విభిన్నమైన సూట్లను అందిస్తుంది. దేశవ్యాప్తంగా 98% పైగా పిన్-కోడ్లలో వినియోగదారులకు కంపెనీ సేవలు అందిస్తుంది.