Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశపు నెంబర్ వన్ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ బ్రాండ్ షామి ఇండియాకు చెందిన సబ్ బ్రాండ్ రెడ్మి ఇండియా, తన రెడ్మి నోట్ సిరీస్‌లో 11వ జనరేషన్ విస్తరణలో భాగంగా రెడ్మి నోట్ 11ఎస్, రెడ్మి నోట్ 11 విడుదల చేస్తున్నట్టు నేడు ప్రకటించింది. ఈ సరికొత్త రెడ్మి నోట్ సిరీస్‌లో అద్భుతమైన ఆల్ రౌండ్ కెమెరా సిస్టమ్, ఈ రంగంలోనే ప్రముఖమైన డిస్ప్లే, సమర్ధవంతమైన ఛార్జింగ్ సామర్ధ్యం కలిగి ఉంది. ఇవన్నీ కూడా సరసమైన ధరల్లో యూజర్‌కు చక్కని అనుభూతిని అందిస్తాయి. MIUI 13 ఔట్ ఆఫ్ ది బాక్స్‌తో వస్తున్న మొదటి డివైసులు ఇవి. ఇవి యూజర్ల అనుభూతిని పెంపొందిస్తాయి. రెడ్మి నోట్ 11ఎస్ అద్భుతమైన క్వాడ్ కెమెరా సెటప్‌తో పాటు సాంసంగ్ హెచ్ఎం2 కెమెరా సెన్సర్‌తో కూడిన 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఈ ధరకు రెడ్మి నోట్ 11ఎస్ అత్యంత సరసమైనది, దీనిలో 90 హెచ్జడ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, అద్భుతమైన కెమెరా సిస్టమ్‌తో పాటు 5000 ఎంఎహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ఆవిష్కరణలు అందరికి అందించాలని నిజాయితీ ధరతో కూడిన క్లాసిక్ రెడ్మి నోట్ 11, 6.43” ఎఫ్‌హెచ్‌డీ + అమోలెడ్ డిస్ప్లే, 90 హెచ్జడ్ రీఫ్రెష్ రేట్, 5000 ఎంఎహెచ్ భారీ బ్యాటరీ, 33 వాట్స్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 50 ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఈ విడుదల సందర్భంగా షామి ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మురళీకృష్ణన్. బి, మాట్లాడుతూ, “సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేసి అందరికీ అందుబాటులోకి తేవాలని రెడ్మిలో మేము ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాం. ఏళ్లుగా రెడ్మి నోట్ సిరీస్ సరసమైన ధరలో అద్భుతమైన, ఆల్ రౌండ్ అనుభూతులు అందిస్తున్నాయి. రెడ్మి సిద్ధాంతానికి సంపూర్ణంగా కట్టుబడి ఇప్పుడు మేము సరికొత్త రెడ్మి నోట్ 11ఎస్, రెడ్మి నోట్ 11ను ఆవిష్కరిస్తున్నాం. ఇందులో మేము డిస్ప్లే, ఛార్జింగ్, కెమెరా సామర్ధ్యం వంటివన్నీ అప్‌గ్రేడ్ మా వినియోగదారులకు అందిస్తున్నాం. సరికొత్త రెడ్మి నోట్ 11 సిరీస్‌లో వైవిధ్యభరితమైన కెమెరా సెటప్, మైమరపింపజేసే 90 హెచ్డజ్ అమోలెడ్ డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యంతో మా వినియోగదారులకు చక్కని స్మార్ట్‌ఫోన్ అనుభూతి అందిస్తాయి” అన్నారు
రెడ్మి నోట్ 11ఎల్
అల్ట్రా క్లియర్ 108ఎంపీ ఎఐ-క్వాడ్ కెమెరా సెటప్
నాణ్యతను ఉన్నతస్థాయికి తీసుకెళ్తూ రెడ్మి నోట్ 11ఎస్ 108 ఎంపీ ప్రైమరీ కెమెరా కలిగి ఉంది. దీని ద్వారా యూజర్లు తమ మధురానుభూతలను హై-రెజల్యూషన్‌లో క్యాప్చర్ చేసుకోవచ్చు, షేర్ చేయవచ్చు. భారీ 1/1.52” సెన్సర్ కలిగిన సాంసంగ్ హెచ్ఎం2 సెన్సర్‌ను సద్వినియోగం చేసుకుంటూ మెయిన్ కెమెరా 9 ఇన్ 1 పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ కలిగి ఉంది. అంతే కాదు అద్భుతమైన చిత్రాలను హయ్యర్ డైనమిక్ రేంజ్, కలర్ పర్ఫామెన్స్లో ఇది అందిస్తుంది. డిమ్ లైట్‌లోనూ చక్కని ఫొటోలు తీసుకోవచ్చు. 118° ఎఫ్ఓవి కలిగిన 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో స్పష్టమైన హై-క్వాలిటీ వైడ్ సినిక్ షాట్స్ తీసుకోవచ్చు. ఇందులోని 2ఎంపీ మ్యాక్రోతో క్లోజప్ షాట్స్ తీసుకోవచ్చు. అలాగే 2ఎంపీ డెప్త్ సెన్సర్‌తో సునిశిత దృశ్యాలను చక్కగా బందించవచ్చు. షార్ప్ సెల్ఫీలు, హై-రెజల్యూషన్ వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16ఎంబీ కెమెరా ఉంది.
పొట్రెయిట్ షాట్స్ కోసం ఇందులోని నేచరుల్ బొకె ఎఫెక్ట్ ఉంది. వీటి ద్వారా అద్భుతమైన చిత్రాలు తీసుకోవచ్చు. అంతే కాదు, యూజర్ల కెమెరా అనుభూతిని పెంచేందుకు ఇందులో ప్రో కలర్, టైమ్ ల్యాప్స్, నైట్ మోడ్, పొట్రెయిట్, పనోరమా, షార్ట్ వీడియో మోడ్ వంటి అనేక మోడ్స్ ఉన్నాయి.
అద్భుతమైన 90Hz హై రీఫ్రెష్ రేట్, Z హ్యాప్టిక్స్తో అమోలెడ్ డిస్ప్లే
రెడ్మి నోట్ 11ఎస్ వినియోగదారులకు సున్నితమైన, సౌకర్యవంతమైన వ్యూయింగ్ అనుభూతితో స్క్రీన్ అనుభూతి మెరుగుపరుస్తుంది, అదే సమయంలో మరింత కచ్చితమైన ఫింగర్ టచ్ నమోదు చేస్తుంది. అందమైన డిస్ప్లే, అధునాతన ఫ్లాట్-ఎడ్జ్ బాడీ డిజైన్‌లో ప్యాక్ అయిన ఈ పరికరానికి డైనమిక్, శక్తివంతమైన రూపాన్ని ఇస్తుంది. ఇది చేతిలో చక్కగా ఇమిడిపోయి సురక్షితంగా ఉంటుంది. 6.43-అంగుళాల స్క్రీన్‌తో రెడ్మి నోట్ 11S 90Hz ఎఫ్‌హెచ్‌డీ+అమోలెడ్ డిస్ప్లేతో పాటు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. ఇది 1000నిట్స్ పీక్ బ్రైట్నెస్, మెరుగైన వ్యూయింగ్ అనుభూతిని అందిస్తూ DCI-P3 వైడ్ కలర్ గామట్‌తో వస్తుంది. ఇది లైఫ్ విజువల్స్, రిచ్ కలర్ రిప్రజెంటేషన్లను స్క్రీన్‌పైకి తీసుకువస్తుంది. వీక్షణ అనుభూతిని మెరుగుపరుస్తూ, రెడ్మి నోట్ 11ఎస్ ఇన్‌బిల్ట్ సన్‌లైట్ మోడ్, రీడింగ్ మోడ్ 3.0తో పేపర్ ఆకృతితో వస్తుంది. ఇది కంటి ఒత్తిడిని తగ్గించడానికి నిజమైన పేపర్‌ను అనుకరిస్తుంది. ఫోన్ ఎగువన, దిగువన ఉన్న డ్యూయల్ సూపర్ లీనియర్ స్పీకర్లతో, రెడ్మి నోట్ 11 సిరీస్ గేమింగ్ లేదా వీడియోలను చూడటం కోసం లీనమయ్యే స్టీరియో సౌండ్‌తో పూర్తి వినోద అనుభవాన్ని అందిస్తుంది. రెడ్మి నోట్ 11ఎస్ డిస్ప్లేపై ప్రమాదవశాత్తు గీతలు పడకుండా చూసేందుకు కార్నింగ్® గొరిల్లా® గ్లాస్ 3తో రక్షణ కలిగి ఉంది.
5000mAH భారీ బ్యాటరీ, 33వాట్స్ ప్రొ ఫాస్ట్ ఛార్జింగ్‌తో
రెడ్మి నోట్ 11ఎస్ 33వాట్స్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. దాదాపు 60 నిమిషాల్లో** 100% వరకు ఛార్జ్ అవుతుంది. ప్రో ఛార్జింగ్ టెక్నాలజీతో బ్యాటరీ మద్య నుంచి రెండు వైపులా సమానంగా ఛార్జ్ అవుతుంది. ఇది పూర్తి ఛార్జ్ కోసం తీసుకునే సమయాన్ని తగ్గిస్తుంది, 33W ప్రో ఛార్జర్ కంటే దాదాపు 15% తక్కువ సమయం పడుతుంది.
లిక్విడ్ కూల్ టెక్నాలజీతో సూపర్ పనితీరు
స్థిరమైన పనితీరు, చక్కని ఆట కోసం రెడ్మి నోట్ 11ఎస్ సరికొత్త, శక్తిమంతమైన మీడియాటెక్ హిలియో G96 చిప్సెట్తో డిజైన్ చేయబడింది. ఆక్టా-కోర్ చిప్సెట్ సీపీయూలో 2.05GHz వరకు క్లాక్ చేయబడిన శక్తివంతమైన ఆర్మ్ కార్టెక్స్-A76 ప్రాసెసర్ కోర్లు కలిగి ఉంది. అత్యున్నత పనితీరు అందించేందుకు ఆర్మ్ మాలి-G57 గ్రాఫిక్స్‌తో కూడి ఉంది. లిక్విడ్ కూల్ టెక్నాలజీ కలిసిన ఈ డివైజ్, సమర్థవంతమైన కూలింగ్ కోసం మల్టీ గ్రాఫైట్ షీట్లు ఉపయోగిస్తుంది. గేమింగ్ కావచ్చు లేదా ఛార్జింగ్ కావచ్చు ఇందులోని హీట్ డిస్సిపేషన్ సిస్టమ్ పరికరాన్ని ఎల్లవేళలా చల్లగా ఉంచుతుంది. రెడ్మి నోట్ 11ఎస్ మృదువైన మల్టీ టాస్కింగ్ పనితీరు కోసం LPDDR4X RAMతో పాటు వేగవంతమైన యూఎఫ్ఎస్ 2.2 హై-స్పీడ్ స్టోరేజ్‌తో జత చేయబడింది. అన్ని సమయాల్లో అత్యుత్తమ పనితీరు కోసం 11GB* వరకు విస్తరించుకోదగిన వర్చువల్ ర్యామ్ బూస్టర్ అప్‌గ్రేడ్ ఫీచర్ కలిగి ఉంది.
ఈవీఓఎల్ డిజైన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ
సరికొత్త ఈవీఓఎల్ డిజైన్‌ను కొనసాగిస్తూ రెడ్మి నోట్ 11ఎస్ సరికొత్త లుక్‌తో చేతికి ఒక ప్రీమియం అనుభూతి అందిస్తుంది. 8.09 ఎంఎం మందంతో కూడిన ఈ స్మార్ట్ ఫోన్ బరువు కేవలం 179 గ్రాములు మాత్రమే. దీన్ని ఉపయోగించడం, జేబులో పెట్టుకొని తిరగడం ఎంతో సులువు, విలాసవంతమైన ఫీల్, స్మూత్ టెక్చ్చర్తో కూడిన డివైస్ స్పేస్ బ్ల్యాక్, హొరైజన్ బ్లూ, పోలార్ వైట్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. అంతే కాదు ఆ పోర్టులన్నీ తుప్పు పట్టని రబ్బరైజ్డ్ సీల్స్‌తో వస్తాయి.
రెడ్మి నోట్ 11
50ఎంపీ –క్వాడ్ కెమెరా సెటప్
రెడ్మి నోట్ 11- 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 118° ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగి ఉంది. ఏ మూవ్‌మెంట్‌ను అయినా ఎంతో స్పష్టతతో, సంపూర్ణంగా క్యాప్చర్ చేసేందుకు యూజర్లకు అనుమతినిస్తుంది. క్లోజప్, మాక్రో షాట్స్ కోసం ఇందులో 2ఎంపీ డెప్త్ సెన్సర్, 2ఎంపీ మ్యాక్రో సెన్సర్ కూడా కలిగి ఉంది. సెల్ఫీలు తీసుకునేందుకు, ప్రతీ క్షణాన్ని ఒడిసిపట్టేందుకు ముందు వైపు 13 ఎంపీ కెమెరాతో కూడి ఉంది రెడ్మి 11
కట్టిపడేసే అమోలెడ్ డిస్ప్లే
6.43’’ ఎఫ్‌హెచ్‌డీ + అమోలెడ్ డిస్ప్లే 1000నిట్స్ పీక్ బ్రైట్నెస్, డీసీఐ-P3 విశాలమైన కలర్ గామట్, అందమైన ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌లో రెడ్మి నోట్ 11 ఉంటుంది. రెస్పాన్సివ్ గేమింగ్, అంతరాయం లేని డిస్ప్లే అనుభూతి అందించేందుకు ఇది 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. అంతే కాదు చక్కని హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ కోసం Z-యాక్సిస్ వైబ్రేషన్ మోటార్‌తో పాటు డ్యూయల్-లీనియర్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.
క్వాల్కామ్ ® స్నాప్‌డ్రాగన్ ™ 680తో పూర్తిస్థాయి పర్ఫామెన్స్
రెడ్మి నోట్ 11 భారతదేశానికి క్వాల్కామ్® స్నాప్‌డ్రాగన్™ 680 ప్రాసెసర్‌ని తీసుకువచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్. చిప్సెట్ 6nm ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుంది. క్వాల్కామ్® అడ్రెనో™ 610 జీపీయూ, క్వాల్కామ్® కైరో™ 265 సీపీయూ కలిగి ఉంది. అత్యుత్తమ పనితీరు, శక్తి సామర్థ్యాన్ని అందించేలా ఇది రూపొందించబడింది. రెడ్మి నోట్ 11 కూడా LPDDR4X ర్యామ్ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో జత చేయబడింది. రెడ్మి నోట్ 11 8GB** RAM బూస్టర్‌తో వస్తుంది. మల్టీ టాస్కింగ్‌లో వినియోగదారులకు వేగంగా సాయపడుతుంది.
రెడ్మి నోట్ 11లోని ప్రాసెసర్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్స్ కోసం అనేక వేక్ వర్డ్స్‌కు సపోర్టు చేస్తోంది. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ రెండింటిని యూజర్లు తమ మొబైల్ అసిస్టెంట్ సెటప్ చేసుకొని వాటిని అదే సమయంలో హ్యాండ్స్ ఫ్రీగానూ యూజ్ చేసుకోవచ్చు.
శక్తిమంతమైన 5000mAh బ్యాటరీ
రెడ్మి నోట్ 11 5000mAh బ్యాటరీ, 33వాట్స్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగి ఉంది. బ్యాటరీ అయిపోతుందని యూజర్లు దిగులు చెందక్కర్లేదు, బ్యాటరీ రోజంతా పనిచేస్తుంది, అలాగే ఇందులో ఉండే డ్యూయల్ స్ప్లిట్ ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీతో 60నిమిషాల్లో *** బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
వాయిస్ అసిస్టెంట్ సామర్ధ్యం
మైమరపింపజేసే అనుభవాన్ని అందించేందుకు రెడ్మి నోట్ 11 వాయిస్-అసిస్టెంట్ సామర్థ్యం కలిగి ఉంది. మా యూజర్లు ఇప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు మ్యూజిక్ ప్లే చేయడానికి, కాల్స్ చేయడానికి, యాప్స్ ఒపెన్ చేయడానికి, స్మార్ట్ పరికరాలు కంట్రోల్ చేసేందుకు, డైరెక్షన్స్ తెలుసుకోవడం సహ అడగటానికి, ఇంకా మరెన్నో చేయడానికి వారి వాయిస్‌తో అమెజాన్ అలెక్సా హ్యాండ్స్-ఫ్రీ యాక్సెస్‌ను ఆనందించవచ్చు.
ఈవీఓఎల్ డిజైన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ
కంటికి ఇంపైన మూడు రంగుల్లో రెడ్మి నోట్ 11 అందుబాటులో ఉంటుంది – స్పేస్ బ్ల్యాక్, హొరైజన్ బ్లూ, స్టారీ ఫినిష్ టెక్స్చర్తో స్టార్‌బస్ట్ వైట్. అన్ని ప్రధాన అవసరాలు యథాతథంగా ఇందులో ఉన్నాయి. ఇందులో రెండు సిమ్ కార్డులతో పాటు ఒక ప్రత్యేకమైన మైక్రో ఎస్డీ కార్డు స్లాట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ సహ సూపర్ కనెక్టివిటీ కోసం ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. అంతే కాదు హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్ కోసం ఇందులో Z-యాక్సిస్ లీనియర్ మోటర్ కూడా ఉంది. ఐపీ53 రేటింగ్ కలిగిన ఈ ఫోన్ దుమ్ము, నీళ్లులోనికి పోకుండా రక్షిస్తుంది.
అత్యుత్తమ నాణ్యత
డ్యూయల్ సూపర్ స్టీరియో సెటప్‌తో కూడిన రెడ్మి నోట్ 11ఎస్, రెడ్మి నోట్ 11 స్పష్టమైన, చక్కని మైమరపింపజేసే నాణ్యమైన ధ్వనిని అందిస్తాయి. అంతే కాదు ఫుల్ స్టీరియోతో గేమ్స్, మీడియాలో మునిగిపోయే అనుభూతిని యూజర్లకు అందిస్తాయి. యూజర్ల అవసరాలన్నీ తీర్చేందుకు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉంది.