Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ నాట్కో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 27 శాతం వృద్థితో రూ.80.4 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ3లో రూ.63.40 కోట్ల లాభాలు ఆర్జించింది. గడిచిన డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 53 శాతం పెరిగి రూ.590.7 కోట్లకు చేరడంతో మెరుగైన ప్రగతిని కనబర్చినట్లు ఆ కంపెనీ పేర్కొంది. మూడో మధ్యంతర డివిడెండ్ కింద ప్రతీ రూ.2 విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై రూ.2 లేదా 100 శాతం డివిడెండ్‌ను చెల్లించడానికి నాట్కో బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.