Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ : ఏబీజీ షిప్‌యార్డ్ మోసాన్ని బ్యాంక్‌లు సాధారణ సమయం కంటే వేగంగానే గుర్తించాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2014 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించాయన్నారు. ఈ స్థాయి మోసాలను తేల్చడానికి సాధారణంగా 52-54 నెలల సమయం పడుతుందన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయ్యిందన్నారు. గుజరాత్ కేంద్రంగా పని చేస్తున్న ఈ షిప్పింగ్ కంపెనీ దేశంలోని 28 బ్యాంక్‌లకు రూ.22,842 కోట్ల ఎగనామం పెట్టింది. సిబిఐ ప్రతీ ఆధారాన్ని సమీకరించిందని మంత్రి తెలిపారు. ఇదే సమయంలో ఎన్సీఎల్టీ ప్రక్రియ కూడా నడుస్తుందన్నారు. 2013 నవంబర్లోనే బ్యాంక్‌లు ఈ ఖాతాను ఎన్పీఏగా గుర్తించాయన్నారు.సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఆర్బీఐ బోర్డు మీటింగ్ తర్వాత గవర్నర్ శక్తికాంత దాస్‌తో కలిసి సీతారామన్ మీడియాతో మాట్లాడారు. ఏబీజీ షిప్‌యార్డ్ మోసం 2014 ముందు నాటిదేనన్నారు.