Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మాంస ఉత్పత్తుల ఆన్లైన్ విక్రయ వేదిక ఫ్రెష్ టు హోమ్ తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇక్కడి మరో 40 ప్రాంతాలకు విస్తరించడంతో పాటుగా 15 నూతన పవర్డ్ బై ఫ్రెష్ టు హోమ్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే 40 కీలక పట్టణాలు, నగరాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఫ్రెష్ టు హోమ్ ఫౌండర్ షాన్ కడవిల్ తెలిపారు.