Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆక్‌జోనోబెల్ యాక్సిలేటర్ ఫర్ కమర్షిలైజేషన్లో చేరనున్న డిజిటల్ కన్సూమర్ ఎక్స్‌పీరియన్స్‌లో సంచలన పరిష్కారాలు చూపే స్టార్టప్స్
న్యూఢిల్లీ : భారతదేశంలో త్వరలో ప్రారంభించనున్న ఆక్జో నోబెల్ 2022 పెయింట్ ది ఫ్యూచర్ ప్రాంతీయ స్టార్టప్ ఛాలెంజ్, వినియోగదారుల డిజిటల్ అనుభూతులను మెరుగుపరిచేందుకు సృజనాత్మత పరిష్కారాలు కనుగొనడంపై దృష్టి సారించనుంది. కంపెనీకి ఉన్న విస్తృత పరిజ్ఞానం, అద్భుతమైన అనుభవాన్ని అందిపుచ్చుకోవాలని స్టార్టప్స్‌ను ఆహ్వానించడం జరుగుతుంది. దీని ద్వారా వారు తమ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు వారి డిజిటల్ సొల్యూషన్స్‌కు తగిన విలువను కూడా నిర్మించుకోవచ్చు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
పెయింట్ ది ఫ్యూచర్‌ను 2019లో అంతర్జాతీయ స్టార్టప్ ఛాలెంజ్‌గా 2019లో ప్రారభించడం జరిగింది. ఇది చాలా వేగంగా ప్రపంచంలోని పెయింట్స్, కోటింగ్ పరిశ్రమలో అతి పెద్ద సహకార ఆవిష్కరణ వ్యవస్థగా ఎదిగింది. ప్రారంభించిన తర్వాత, ఈ పోటీని మరింత విస్తరించడం జరిగింది. బ్రెజిల్, చైనాలో రెండు ప్రాంతీయ పోటీలు నిర్వహణతో పాటు రెండు సప్లయర్ పోటీలు కూడా ఏర్పాటు చేయడమైనది. ఇప్పుడు 2022లో మూడో ప్రాంతీయ స్టార్టప్ పోటీని భారత్‌లో ప్రారంభమైంది.
ఆక్జో నోబెల్ సీఈఓ థెయిరీ వాన్ల్యాంక్నర్ మాట్లాడుతూ.. 'హొనిమా అగ్రశ్రేణి స్పూర్తిని, పెయింట్స్, కోటింగ్స్‌లో ఉన్న శతాబ్దాల అనుభవాన్ని స్టార్టప్స్‌తో పంచుకొని వినూత్న పరిష్కారాలను వేగవంతం చేయడంలో సాయపడుతున్నందుకు మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. భారతదేశ స్టార్టప్ వ్యవస్థ ప్రపంచంలోనే మూడో అతి పెద్దది, నిజంగా ఇది ఒక శక్తి కేంద్రం. సంచలన డిజిటల్ పరిష్కారాల కోసం మేము చురుకైన సహకారం అందించడంతో పాటు కలిసికట్టుగా భవిష్యత్‌ను ఎలా పెయింట్ చేయగలమనే దాన్ని అన్వేషిస్తున్నాం` అని అన్నారు.
ఆక్జో నోబెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ క్లాస్ క్రూయిథోఫ్ మాట్లాడుతూ.. 'హొనిపెయింట్ ది ఫ్యూచర్ అనేది చురుకైన భారతీయ స్టార్టప్స్‌కు ఒక సవాల్, మా తరపున ఒక హామీ కూడా. మా ఖాతాదారులకు ఆనందాన్ని తీసుకువచ్చేందుకు మార్కెట్లోకి డిజిటల్ ఆవిష్కరణలు వేగవంతం చేసేందుకు విన్-విన్ విధానంతో మేము వారితో భాగస్వామ్యమవుతాం` అని అన్నారు
పెయింట్ ది ఫ్యూచర్ స్టార్టప్ పోటీ మార్చి 1, 2022 నుంచి అధికారికంగా ప్రారంభమవుతుంది. ఎంపికైన స్టార్టప్స్‌ను 2022 చివరలో జరిగే కార్యక్రమాన్ని ఆహ్వానించి అక్కడ విజేతలను ప్రకటిస్తారు.
విజేతలుగా నిలిచిన వారికి ఆక్జో నోబెల్ యాక్సిలరేటర్ కార్యక్రమంలో భాగస్వామ్య అవకాశాలు కల్పించి వారి పరిష్కారాలను మరింత అభివృద్ధి చేసేందుకు, అమలు చేసేందుకు చేయూత అందించడం జరుగుతుంది.
ఆక్జో నోబెల్ డెకరేటివ్ పెయింట్స్, ఆగ్నేయ, దక్షిణ ఆసియా (ఎస్ఈఎస్ఎ) మేనేజింగ్ డైరెక్టర్ ఆస్కార్ వెజెన్బీక్ మాట్లాడుతూ 'భారత స్వాతంత్ర్యపు 75వ వసంతాలు జరుపుకుంటున్న వేళ పెయింట్ ది ఫ్యూచర్ మొదటిసారిగా భారతదేశ పెయింట్స్ పరిశ్రమలో సరికొత్త సహకార ఆవిష్కరణకు దారితీసి పరివర్తన తీసుకువస్తుందని మేము నమ్ముతున్నాం. అంతర్జాతీయ వేదికలపై నవభారతానికి వెన్నుముకగా నిలుస్తున్న భారతీయ స్టార్టప్స్ ద్వారా ఇది వినియోగదారులు కేంద్రంగా డిజిటల్ సంచలనాలను పెంపొందిస్తుందని భావిస్తున్నాం` అని అన్నారు.
భారతీయ పోటీకి సంబంధించిన డిజిటల్ కన్సూమర్ ఎక్స్పీరియన్స్ థీమ్ గురించి ఆక్జో నోబెల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ రాజ్‌గోపాల్ వివరిస్తూ.. 'నిడ్యూలక్స్ పెయింట్స్ మ్యాజిక్‌ను పెంచేందుకు డిజిటల్ సొల్యూషన్స్ కనిపెట్టేందుకు ఉద్దేశించినది ది పెయింట్ ఫ్యూచర్ ఇండిటా స్టార్టప్ ఛాలెంజ్. ఇది మా ఉత్పత్తులు, సేవలకు సంబంధించిహొ వినియోగదారుల అనుభూతులను మార్చేస్తుంది` అన్నారు
'అంతే కాదు, మా భాగస్వామి నాస్కామ్ ఇండస్ట్రీ పార్టనర్షిప్ ప్రోగ్రామ్ అండర్ 10,000 స్టార్టప్స్ పరిచయం చేస్తున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉంది. పెయింట్ ది ఫ్యూచర్‌ను NIPP ప్రోత్సహించడంతో పాటు పారిశ్రామిక దిగ్గజాలైన ఆక్జో నోబెల్, ఇతర స్టార్టప్స్ మధ్య అంతరాన్ని పొగొట్టి భారతదేశంలో కొత్త అవకాశాలు సృష్టిస్తుందని మేము నమ్ముతున్నాం` అన్నారు.
భారతీయ స్టార్టప్స్‌కు ఈ పోటీ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని తెలిపిన నాస్కామ్ 10,000 స్టార్టప్స్ సీనియర్ డైరెక్టర్ కృతికా మురగేశన్, అందులోని ఉండే విశేషాలు తెలియజేశారు. 'ఆక్జో నోబెల్ ఇండియాతో కలిసి ఈ సృజనాత్మక కార్యక్రమంలో పనిచేయడం మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇది ఇది స్టార్టప్ వ్యవస్థను వేగవంతం చేసి, మెరుగైన, డిజిటల్ ఆదారిత పరిష్కారాలు రూపొందించడంలో సాయపడుతుంది. పరిశ్రమల నిర్ధిష్ట అవసరాలను అన్వేషిస్తూ స్టార్టప్స్ కలిసికట్టుగా అందించే సరైన సాంకేతిక సృజనాత్మక ఆవిష్కరణలు అందించేందుకు నాస్కామ్ కట్టుబడి ఉంది. మన ఆలోచన, పనితీరును పునరాలోచించేలా చేయగల శక్తి డిజిటలైజేషన్‌కు ఉంది.హొ పెయింట్, కోట్స్ పరిశ్రమ కార్యకలాపాల్లో విప్లవాన్ని తీసుుకువచ్చే ఆచరణాత్మక డిజిటల్ పరిష్కారాలను పెయింట్ ది ఫ్యూచర్ 2022 స్టార్టప్ ఛాలెంజ్ 2022 తీసుకువస్తుందని మేము నమ్మకంతో ఉన్నాం. టెక్ స్టార్టప్స్ తమ ఉత్పత్తులను పరిశ్రమల్లో ఉపయోగపడేలా చూసుకుంటూ భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఈ పోటీ ఒక అవకాశంగా నిలుస్తుంది` అన్నారు.
పెయింట్ ది ఫ్యూచర్ స్టార్టప్ ఛాలెంజ్ 2022 గురించి మరింత తెలుసుకునేందుకుhttps://letspaintthefuture.com/india-challenge సందర్శించండి.