Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కియా ఇండియా, దేశంలో అతి వేగంగా వృద్ధి చెందుతున్న కారు తయారీదారు, తమ నాలుగవ మరియు కొత్త 'మేడ్ ఫర్ ఇండియా', మూడు వరుసల విశ్రాంతి వాహనం కారెన్స్ ప్రారంభోత్సవాన్ని నేడు ప్రకటించింది. ద కారెన్స్ ప్రీమియం స్మార్ట్ స్ట్రీమ్ 1.5 పెట్రోల్ 6 ఎంటీ వేరియెంట్ పోటీయుత ధర ఐఎన్ఆర్ INR 8.99 Lakhs (ex-showroom, pan-India). లక్షలకు (ఎక్స్ -షోరూం, భారతదేశంవ్యాప్తంగా) అమ్ముడవుతోంది. కారెన్స్ 19 వేరియెంట్స్ లో ఐఎన్ఆర్ xxxనుండి xxx లక్షలు (ఎక్స్ -షోరూం, భారతదేశంవ్యాప్తంగా) ధరలతో అందించబడుతోంది. ఈ అత్యంతగా ఊహించబడిన మోడల్ 5 ట్రిమ్స్, 3 ఇంజన్స్ మరియు 3 ట్రాన్స్ మిషన్ ఆప్షన్స్ లభిస్తున్నాయి. సమగ్రమైన ఫీచర్ల జాబితా, భద్రతకు గట్టి ప్రాధాన్యతతో, కియా కారెన్స్ దేశంలోనే ఆధునిక భారతదేశపు కుటుంబాలు కోసం అతి సురక్షితమైన, అత్యంత విలువ ప్రతిపాదన గల కార్లలో ఒకటిగా రూపొందించబడింది. కుటుంబాన్ని రవాణా చేసే ఆధునిక ప్యాకింగ్ మరియు ఎస్ యూవీ యొక్క అనుకూలతని ఒకే దానిలో చూడవచ్చు. 2022, జనవరి 14న బుక్కింగ్స్ ఆరంభమైన నాటి నుండి కేవలం 1 నెల రోజులలో ఇప్పటి వరకు కంపెనీ కారు కోసం 19,089 బుక్కింగ్స్ ని అందుకుంది.
కియా కారెన్స్ అయిదు ట్రిమ్ స్థాయిలలో లభిస్తోంది : ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్. వాహనం ప్రీమియం నుండి లగ్జరీ ట్రిమ్స్ వరకు ఏడు- సీట్లు గల ఆకృతిలో, 6 మరియు 7 సీట్ల ఆకృతిలో లగ్జరీ ప్లస్ ట్రిమ్ తో లభిస్తోంది. దృఢమైన 10 హై-సేఫ్టీ ప్యాకేజ్ లో భాగంగా 6 ఎయిర్ బ్యాగ్స్, డీబీసీ, వీఎస్ఎం, హెచ్ఏసీ, ఈఎస్ సీ మరియు ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ లు వంటివి అన్ని అయిదు ట్రిమ్ స్థాయిలలో స్టాండర్డ్ గా లభిస్తూ కియా కారెన్స్ ని అతి సురక్షితమైన కుటుంబం వాహనంగా మార్చాయి. కియా కారెన్స్ మూడు ఇంజన్ ఐచ్ఛికాలలో అందించబడుతోంది : స్మార్ట్ స్ట్రీమ్ 1.5 పెట్రోల్, స్మార్ట్ స్ట్రీమ్ 1.4 టి-GDiపెట్రోల్, 1.5 CRDiవీజీటీ డీజిల్లు, మూడు ట్రాన్స్ మిషన్స్ లో అనగా 6 ఎంటీ, 7 డీసీటీ, లేదా 6ఏటీలలో జత కట్టాయి.
తక్కువ నిర్వహణ ఖర్చు
ఉత్తేజితమైన ధరలకు అదనంగా, కారెన్స్ అతి తక్కువగా ప్రతి కిలోమీటర్ కు 37 పైసల నిర్వహణ ఖర్చులో లభిస్తోంది. కంపెనీ వాహనం సర్వీసింగ్ ప్రక్రియని తమ కస్టమర్లు కోసం వ్యక్తిగతంగా అందించడాన్ని కొనసాగిస్తోంది మరియు దేశంలోని తమ అన్ని మోడల్స్ కోసం మార్కెట్ లో పోటీయుత నిర్వహణ ధరని అందిస్తోంది.
ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ,టే-జిన్ పార్క్, మేనేజింగ్ డైరక్టర్, సీఈఓ, కియా ఇండియా,ఇలా అన్నారు," ఆరంభమైన నాటి నుండి, మా కొత్త పుంతలు తొక్కే వాహనాలు మరియు సేవలు ద్వారా భారతదేశపు కస్టమర్ల డ్రైవింగ్ అనుభవాలకి విలువని చేర్చడం పై మేము దృష్టిని కేంద్రీకరించి ఉన్నాము. కారెన్స్ అనేది నిజమైన కియా, తరగతిలో ఉత్తమమైన ఫీచర్లు, లోపాలు లేని డిజైన్, ఆచరణసాధ్యత, ఆకట్టుకునే ధరలలో విస్త్రతమైన వేరియెంట్ ఎంపికల్ని అందిస్తోంది. ధర నిర్ణయం మరింత విలక్షణమైన మా కస్టమర్లకి సేవలు కలిగించే అవకాశం మాకు అందించింది. ఈ పెరిగిన డిమాండ్ కి తగిన సరఫరా చేయడానికి మేము మా ఉత్పత్తిని మెరుగుపరుస్తాము.”
ఆయన ఇంకా ఇలా అన్నారు: "ప్రతి కిలోమీటర్ కు అతి తక్కువగా 37 పైసలు నుండి ఆరంభమైన నిర్వహణ ఖర్చుతో మా కస్టమర్లు కారెన్స్ యొక్క అద్భుతమైన యాజమాన్యం అనుభవం కలిగి ఉండగలరని మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. అందించబడిన విలువ ప్రాతిపదిక ఈ వాహనాన్ని ఆధునిక భారతీయ కుటుంబాలు కోరుకునే వాహనంగా చేసింది."
మై కన్వీనియెన్స్ ప్లస్
కారెన్స్ ప్రారంభంతో పాటు కియా ఇండియా కారెన్స్ ఓనర్ షిప్ డిఫరెన్షియేటర్ ప్రారంభాన్ని కూడా ప్రకటించింది. 'మా కన్వీనియెన్స్ ప్లస్'. పూర్తి మనశ్సాంతిని కొత్త కారెన్స్ బయ్యర్స్ కోసం అందించడానికి ఈ చొరవ సమగ్రమైన కవరేజ్ ని అందిస్తోంది.
'మై కన్వీనియెన్స్ ప్లస్' అనేది వాహనంతో పాటు కొనుగోలు చేసే కారెన్స్ -ప్రత్యేకమైన ఆఫ్టర్ సేల్స్ చొరవ మరియు పీపీఎం (ప్రీ-పెయిడ్ మెయింటెనెన్స్), ఈడబ్ల్యూ ( ఎక్స్ టెండెడ్ వారంటీ), ఆప్షనల్ ఆర్ఎస్ఏ (రోడ్ సైడ్ అసిస్టెన్స్) దీనిలో భాగంగా ఉన్నాయి. ఈ చొరవ పరిశ్రమలో మొదటి ఆఫ్టర్ సేల్స్ చొరవ, దేశంలోనే ఏదైనా ఇతర ఓఈఎంతో అవివాదాస్పదమైనది. ఇది పూర్తి భారతదేశం వ్యాప్తంగా లభించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఒకే రకమైన ధరలతో లభిస్తోంది. కస్టమర్లు ప్రీమియం మరియు లగ్జరీ ప్యాకేజ్ నుండి ఎంచుకుంటున్నారు, ఇది కార్ ని వరుసగా 4, 5 సంవత్సరాలు కవర్ చేస్తుంది. ఈ చొరవ కార్ సంరక్షణ సేవలు పై ఆకర్షణీయమైన ప్యాకేజీని అందిస్తోంది, కార్యక్రమం వ్యవధి సమయంలో పొందినట్లయితే, సేవా ఖర్చులో ద్రవ్యోల్బణం నుండి కస్టమర్లని కాపాడుతుంది.
మై కియా
తమ కస్టమర్లకు అత్యంత ఉత్తమమైన సౌకర్యాన్ని అందించే కలతో, కంపెనీ 'మై కియా 'మొబైల్ యాప్ ని కూడా ఆరంభించింది- కియాకి సంబంధించిన అన్ని అవసరాలు కోసం ఇప్పటికే ఉన్న మరియు కాబోయే కస్టమర్లు కోసం అన్ని పరిష్కారాలు ఒకే చోట లభించే గమ్యస్థానం. 'మై కియా' యాప్ ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ వ్యవస్థలు పై లభిస్తోంది, కాబోయే కస్టమర్లు టెస్ట్ డ్రైవ్, వీడియో సంప్రదింపు కోసం అభ్యర్థించవచ్చు మరియు తాము ప్రాధాన్యతనిచ్చిన కియా కారుని కూడా బుక్ చేయవచ్చు. కియా యొక్క ఇప్పటికే ఉన్న కస్టమర్లు ఈ యాప్ ని సర్వీస్ అప్పాయంట్ మెంట్ మరియు రిమైండర్ కోసం కోసం, పిక అండ్ డ్రాప్ అభ్యర్థన కోసం ఉపయోగించవచ్చు. సేవా ప్రగతి మొదలైన వాటిని పర్యవేక్షించవచ్చు. విలక్షణమైన కస్టమర్ డాష్ బోర్డ్ ద్వారా కియా నుండి ప్రత్యక్ష సహాయం కోసం వాస్తవిక సమయం నోటిఫికేషన్స్, సలహాలు, ఎఫ్ఏక్యూలు కూడా పొందవచ్చు. అప్పటికే ఉన్న కస్టమర్లు కోసం యాప్ విలక్షణమైన మరియు ప్రత్యేకమైన బహుమతి కార్యక్రమాన్ని కూడా అందిస్తుంది, మరియు ఫ్యాషన్, ప్రయాణం, ఎఫ్ అండ్ బీ, ఎలక్ట్రానిక్స్ మరియు లైఫ్ స్టైల్ మొదలైన వివిధ శ్రేణులలో వివిధ వినియోగదారు బ్రాండ్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్స్ ని అందిస్తోంది.