Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ రెనాల్ట్ ఇండియా ఆర్థిక, డిజిటల్ సాధికారతకు మద్దతునివ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలిపింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్‌కు చేయూత అందించెందుకు ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ (కామన్ సర్వీసెస్ సెంటర్లు)తో భాగస్వామ్యమైనట్లు తెలిపింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ సమీపంలోని కడ్తాల్ గ్రామంలో ఐదు వాహనాలను విరాళంగా అందజేసినట్లు వెల్లడించింది. దేశంలోని గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లోని వారిలో వత్తిపరమైన నైపుణ్యాల పెంపుదలకు సాయపడనున్నట్లు పేర్కొంది.