Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వాహనల తయారీదారు కియా ఇండియా దేశ మార్కెట్లోకి తన నూతన మోడల్ 'కరెన్స్'ను విడుదల చేసినట్లు ప్రకటించింది. దీంతో భారత్లో తమ నాలుగో వాహనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లయిందని పేర్కొంది. పలు వేరియంట్లలో లభించే దీని ధరల శ్రేణీని రూ.8.99 లక్షల నుంచి రూ.16.99 లక్షలుగా నిర్ణయించింది. ఎనిమిది రంగుల్లో లభించే ఈ కార్లలో ఏడు సీట్లను పొందుపర్చింది. ఇప్పటికే తాము తయారు చేస్తున్న సెల్టోస్, సోనెట్, కార్నివల్తో పోల్చితే కరెన్స్ డిజైన్ భిన్నంగా ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది.