Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 1736 పాయింట్ల ర్యాలీ
- రష్యా సానుకూల నిర్ణయ ప్రభావం
ముంబయి : రష్యా, ఉక్రెయిన్ల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొనను ందన్న భయాందోళనలో సోమవారం సెషన్లో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉవ్వెత్తున ఎగిశాయి. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి కొన్ని రష్యా బలగాలు వెనక్కి వస్తున్నాయనే వార్తలు మదుపర్లలో ఉత్సాహాన్ని నింపాయి. మరోవైపు ముడి చమురు ధరల్లో 3 శాతం తగ్గుదల మార్కెట్లకు మద్దతునిచ్చాయి. ఈ సానుకూల పరిణామాల మధ్య బిఎస్ఇ సెన్సెక్స్ 1736 పాయింట్లు లేదా 3.08 శాతం పెరిగి 58,142కు చేరింది. ఇంట్రాడేలో 58,211 గరిష్ట స్థాయిని తాకింది. ఇదే బాటలో ఎన్ఎస్ఇ నిఫ్టీ 510 పాయింట్లు రాణించి 17,352 వద్ద ముగిసింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.7 శాతం, 2 శాతం చొప్పున పెరిగాయి. అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, విత్త సేవలు, ఐటీ, రియాల్టీ రంగాలు 3 నుంచి 3.5 శాతం మేర పెరిగాయి. సెన్సెక్స్-30లో అన్నీ లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు సానుకూలంగా నమోదయ్యాయి.