Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జియోలొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్టామ్టామ్ (TOM2), నేడు తన వార్షిక టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 11వ ఎడిషన్‌ను విడుదల చేయగా, 2021లో మొత్తం 58 దేశాల్లోని 404 నగరాల్లో ట్రాఫిక్ పోకడలను ఈ నివేదికలో వివరించింది. భారతీయ నగరాలు ముంబయి, బెంగళూరు, న్యూఢిల్లీ మరియు పుణె నగరాలు వరుసగా 5వ, 10వ, 11వ మరియు 21వ స్థానాల్లో నిలిచాయి. అసాధారణమైన 2020 ఏడాది తర్వాత, గత ఏడాది ఆరోగ్య సంక్షోభ ప్రభావం ప్రయాణాలపై చూపించింది. కొవిడ్-19 వ్యాప్తిని పరిమితం చేసేందుకు పలు దేశాలు తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మహమ్మారి, దాని వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వృద్ధి చెందాయి.
మనందరి పని అలవాట్లలో పటిష్టమైన మార్పులు తీసుకు వచ్చిన ఏడాదిగా 2021 నిలిచింది. పలు కంపెనీలకు ఇల్లే కార్యాలయాలుగా ప్రామాణికంగా మారిపోయాయి. భౌతిక సమావేశాలను టెలికాన్ఫరెన్స్లుభర్తీ చేశాయి. సౌకర్యవంతమైన పని గంటల వెసులుబాటుతో చాలా మంది ప్రయాణికులు తమ రద్దీ వేళలను అధిగమించేందుకు, మార్చుకునేందుకు అవకాశం కలిగింది. దీని ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40% నగరాల్లో పీక్ అవర్స్‌లో మార్పులు వచ్చాయి. 2019తో పోల్చితే 2021లో ట్రాఫిక్ చాలా తక్కువగా తక్కువగా ఉండడంతో, దీన్ని కొవిడ్‌కు ముందు సమయాల బేస్‌లైన్‌గా పరిగణనలోకి తీసుకోవచ్చు. భారతదేశంలో పర్యవేక్షించిన 4 నగరాల్లో, 2019తో పోల్చితే రద్దీ సగటున 23% తక్కువగా ఉండగా, ప్రత్యేకంగా రద్దీ వేళల్లో 31% తగ్గింది.
మహమ్మారి సమయంలో, కొత్త మొబిలిటీ విధానాలు ప్రజాదరణ పొందాయి. ఇ-స్కూటర్, సైకిల్ వినియోగాల్లో వృద్ధి కనిపించగా, అనేక నగరాల్లో సైకిల్ లైన్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ, మైక్రోమొబిలిటీకి నగరాల లోపల మద్ధతు ఇవ్వగలిగినప్పటికీ, చాలా వరకు ట్రాఫిక్ రద్దీ సమస్య కేంద్రాలు నగరం లోపలి భాగంలోని వాహనాల ప్రయాణం నుంచి ఉత్పత్తి అవుతాయి. మహమ్మారి నేపథ్యంలో, భౌతిక దూరాన్ని పాటించేందుకు సురక్షిత మార్గంగా, ఎక్కువ మంది ప్రయాణికులు తమ కార్లలో ప్రయాణించేందుకు మొగ్గు చూపడంతో ప్రజా రవాణా వ్యవస్థ చాలా వరకు తన ఆకర్షణను కోల్పోయింది.
భారతదేశంలో రద్దీ స్థాయి తగ్గుముఖం పట్టినప్పటికీపౌర సంస్థలు, ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను అలవర్చుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తవానికి, మరింత స్థిరమైన ఇంధనాన్ని ఉపయోగించే నిబద్ధతలో భాగంగా, భారత ప్రభుత్వంఎలక్ట్రిక్ వెహికల్ విధానానికి తన 2022 బడ్జెట్లో రూ.2,908.28 కోట్ల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది.
నివేదిక గురించి టామ్టామ్లో స్ట్రాటజిక్ ఆటోమోటివ్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ సచిన్ త్యాగిమాట్లాడుతూ, “మా లొకేషన్ ఇంటెలిజెన్స్ హృదయంలో మ్యాప్ ఉంది. మేము భారీ డేటాతో పని చేస్తూ, కృత్రిమ మేధస్సు మరియు మెషిన్ లెర్నింగ్‌తో మా మ్యాప్‌లను ఆప్టిమైజ్ చేస్తాము. రద్దీ విధానాలను అర్థం చేసుకునేందుకు మేము సేకరించే రియల్- టైమ్ ట్రాఫిక్ సమాచారం, మహమ్మారి కారణంగా నెలకొన్న అనుకూల జీవనశైలిలో భాగంగా మొబిలిటీ ఎంపికలు వేగంగా మారుతున్నాయని సూచిస్తున్నాయి. కొవిడ్‌కు ముందు సమయాలతో పోలిస్తే రద్దీ స్థాయి తగ్గుముఖం పట్టినప్పటికీ, భారతీయ నగరాల్లో ఇ-కామర్స్‌కు డిమాండ్, పని తీరులో మార్పుల కారణంగా ఇది ఎక్కువగా ఉంది’’ అని వివరించారు.
దీని గురించి మరింత వివరిస్తూ, “విధాన రూపకర్తలు సానుకూల మార్పును గుర్తిస్తూ, రహదారులకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు ఉద్దేశించిన సంపూర్ణ నిబంధనలను అనుసరించాలని మేము కోరుకుంటున్నాము. ఇది రద్దీ స్థాయిని మరింత తగ్గిస్తూ, ప్రత్యామ్నాయ స్థిరమైన రవాణా విధానాలను ప్రోత్సహిస్తూ, ఉద్గార స్థాయిని తగ్గిస్తుంది. రియల్ టైమ్ డేటాను వినియోగించుకునే మెరుగైన సాంకేతికతను స్వీకరించడం, ధైర్యంగా ముందుకు వచ్చి పెట్టుబడి పెట్టడం మరియు నిర్భయ విధాన నిర్ణయాలు అనుసరించడం మార్పుకు కీలకం’’ అని పేర్కొన్నారు.
ట్రాఫిక్ సమాచారాన్ని డ్రైవర్లు, ట్రాఫిక్ అధికారులకు మరింత సులభంగా అందుబాటులో ఉంచడం ద్వారా ట్రాఫిక్ రద్దీ అడ్డంకులను రియల్ టైమ్‌లో గుర్తించడంలో, రద్దీని సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. టామ్‌టామ్ తన నావిగేషన్ సాఫ్ట్వేర్ ముందు వెళుతున్న వాహన రద్దీని గుర్తించి, మెరుగైన మార్గానికి సంబంధించిన, కచ్చితమైన అంచనా వేళలను అందిస్తుంది (ETA) - డ్రైవర్లు, లాజిస్టిక్స్ ప్రొవైడర్లు, ఆన్-డిమాండ్ సేవలు (రైడ్ హెయిలింగ్, ఫుడ్ డెలివరీ) అందిస్తున్న వారికి సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేస్తుంది. మార్పు ప్రవర్తనలు, ట్రాఫిక్ నమూనాలు గణనీయమైన మార్పుకు కారణమవుతాయి. రద్దీ అనేది నాన్-లీనియర్: ఒకసారి ట్రాఫిక్ నిర్దిష్ట గాడిని తప్పితే, రద్దీ విపరీతంగా పెరుగుతుంది. రద్దీ గరిష్ఠంగా ఉన్నప్పుడు డ్రైవింగ్ వద్దని డ్రైవర్లకు సూచించడం మహమ్మారి సమయంలో ఎక్కువగా కనిపించగా, ఇది భారీ మార్పులకు దారితీస్తుంది.