Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: యూరోప్‌లో అతి పెద్ద హోమ్ అప్లయన్సెస్ తయారీదారు, ఈ రంగంలో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన బీఎస్‌హెచ్ హోమ్ అప్లయన్సెస్ సరికొత్త ఫుల్లీ ఆటోమ్యాటిక్ వాషింగ్ మెషీన్ – బాష్ టాప్ లోడ్ సరికొత్త శ్రేణి ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. భారతీయ వినియోగదారులను లోతుగా అర్థం చేసుకొని రూపొందించిన ఈ అత్యున్నత నాణ్యత కలిగిన వాషింగ్ మెషీన్లు సౌకర్యం, రక్షణతో పాటు మరకలను వదిలించేందుకు సంప్రదాయ చేతి ఉతుకు టెక్నిక్ కలిగి ఉంది. ఫ్యాషన్, దుస్తుల సంరక్షణ కోసం తపించే భారతీయ వినియోగదారుల అవసరాలను ఇది తీర్చుతుంది. ప్రీమియ లుక్ అందించేలా ఇది డిజైన్ ఎంతో అందంగా రూపొందించబడింది, ప్రతీ ఇంట్లోనూ ఇవి ఒక అందమైన డిస్ప్లేగా నిలుస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో (తిరుపతి) తయారైన మేడ్ ఇన్ ఇండియా బాష్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ప్రీమియం ఫీచర్లు, అందమైన డిజైన్ కొనసాగిస్తూ భారతదేశంలోని మాస్ సెగ్మెంట్లో విస్తరించేందుకు బీఎస్‌హెచ్ రూపొందించిన వ్యూహంలో భాగం. వినియోగదారుల అవసరాల్లో లీడర్‌గా నిలిచి 2025 నాటికి ప్రతీ ఇంటిలోనూ భాగం కావాలన్న కంపెనీ లక్ష్యంలో భాగంగా ఇది రూపొందించడం జరిగింది.
విడుదల సందర్భంగా బీఎస్‌హెచ్ హోమ్ అప్లయన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ నీరజ్ బహాల్ మాట్లాడుతూ, “భారతదేశంలో టాప్ లోడ్‌కు ఇప్పటికీ ప్రాధాన్యత ఉంది. వినియోగదారుల అనేక అవసరాలు తీర్చే అత్యంత సుందరమైన ప్రొడక్టును ప్రవేశపెడుతున్నందుకు మేము సంతోషిస్తున్నాము. బాష్ టాప్ లోడ్ ప్రత్యేకత ఏంటంటే ఇది భారతీయ వినియోగదారుల అవసరాల గురించి లోతైన అవగాహనతో భారతదేశంలో తయారు చేయబడినది. ఖరీదైన & రోజువారీ ఫ్యాషన్ దుస్తులకు ఏ మాత్రం నష్టం వాటిల్లకుండా చూడటమే కాదు ఆధునిక భారతీయ గృహాల కోసం సమయానుకూలమైన, సాంకేతికంగా స్మార్టు, సొగసైన ఫీచర్లు అందించేందుకు వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని డిజైన్ & అభివృద్ధి కోసం ఆలోచనాత్మక విధానాన్ని తీసుకున్నాము. మాస్ సెగ్మెంట్లో చొచ్చుకుపోయేందుకు మాకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. మా లాండ్రీ కేర్ (వాషింగ్ మెషీన్లు, డ్రైయర్లు మొదలైనవి) పరిధిలో భారతీయ వినియోగదారులకు విలువ పెంచి పరిపూర్ణమైన సంరక్షణ అందించే వాగ్దానమిచ్చే ప్రీమియం ఫీచర్లు అందించేందుకు మేము కృషి చేస్తున్నాం” అన్నారు. రూ.21,790/- ప్రారంభ ధరతో ఈ ప్రొడక్టు 6 కేజీలు, 7కేజీల వేరియంట్స్‌లో 23 ప్రత్యేకమైన మోడల్స్, మూడు యూజర్ ఇంటర్ఫేస్ రకాలు, ఆరు అద్భుతమైన రంగుల్లో లభిస్తాయి. దేశంలోని ప్రధాన మెట్రో, నాన్ మెటంర్ నగరాల్లో ఇది అందుబాటులో ఉంది.
ప్రత్యేక ఫీచర్లు:
- ప్రీమియం రూపం, ఫీచర్లతో కూడిన హై-ఎండ్ యూజర్ ఇంటర్ఫేజ్.
- ముందుకు నానబెట్టేందుకు వెచ్చని నీరు (ఇన్ బిల్ట్ హీటర్) అందించే సదుపాయం ఉంది కాబట్టి వాషింగ్ మెషీన్లో వేయడానికి ముందు నానబెట్టడం, మొండి మరకలను రుద్దడం వంటివి చేయాల్సిన అవసరం లేదు.
- సులభమైన వర్క్ ఫ్లో, సులభంగా, వేగంగా సెలక్ట్ చేసుకునేందుకు యూజర్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ సెలక్టర్ డయల్. ప్రొప్రైటరీ స్మార్ట్ & ఎక్స్పర్ట్ మోడ్ ద్వారా యూజర్లు వాషింగ్ పారామీటర్స్ అన్ని కంట్రోల్ చేయవచ్చు అదే సమయంలో యూజర్ల అమూల్యమైన దుస్తులకు సంపూర్ణ సంరక్షణ అందిస్తూ ఉత్తమ, నాణ్యమైన ఉతుకును మెషీన్ అందిస్తుంది.
- భారతదేశంలో మొట్టమొదటి యూజర్ ఫ్రెండ్లీ ఇన్-బిల్ట్ వీల్స్, రియర్ హ్యాండిల్ కలిగినది. మెషీన్‌ను వినియోగదారులు సులభంగా కదిలించవచ్చు. చేత్తో ఉతికే ఉతుకులతో ప్రేరణ పొంది ఫ్యాబ్రిక్‌కు సంపూర్ణ సంరక్షణ అందిస్తూ మా ఫ్రంట్ లోడ్ టెక్నాలజీ ద్వారా మరకలు తొలగిస్తుంది.
ప్రత్యేకతలు:
1. వ్యారియో డ్రమ్: దీని డ్రాప్లెట్ డిజైన్ అన్ని రకాల వస్త్రాలకు సున్నితమైన వాష్ అందిస్తుంది
2. స్క్రబ్ ప్యాడ్: మొండి మురికిని వదిలించడంలో సాయపడేలా అద్భుతమైన రుద్దుడు కలిగి ఉంది
3. అసిమెట్రిక్ ప్యాడిల్ : మొండి మరకలను సులభంగా వదిలిచేందుకు అనువైన గరుకు సర్ఫేస్ స్ఫూర్తితో రూపొందించిన డిజైన్
4. 3 క్యామ్ ఇంపెలర్స్: నిలువగా నీటిని అందిస్తూ ఉతుకులో అధిక నాణ్యత అందిస్తుంది
5. మ్యాజిక్ ఫిల్టర్‌తో పంపింగ్ టవర్: మధ్య మధ్యలో మంచి నీళ్లు చిలకరిస్తుంది. అది మంచి రిన్సింగ్ పనితనాన్ని అందిస్తుంది