Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : యూరోపియన్ కంపెనీ బీఎస్‌హెచ్ హోమ్ అప్లయిన్సెస్ భారత మాస్ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అద్భుతమైన డిజైన్, మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌తో రూపొందించిన సరికొత్త వాషింగ్ మెషీన్ బాష్ టాప్ లోడ్‌ను పరిచయం చేస్తోన్నట్టు ఆ సంస్థ సీఈఓ, ఎంఞీ నీరజ్ బV్ాల్ తెలిపారు. దీంతో ఆటోమేటిక్ లాండ్రీ కేటగిరీలో తన మార్కెట్‌ని రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. భారతదేశంలో వినియోగదారులకు కావాల్సిన సాంప్రదాయ హ్యాండ్ వాష్ లాంటి లాండ్రీ టెక్నిక్, సంరక్షణ, మరకలను తొలగించే సామర్థ్యాన్ని అందిస్తూ ఈ వాషింగ్ మెషీన్‌ను రూపొందించామన్నారు. మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌తో తిరుపతిలో ఈ వాషింగ్ మెషీన్‌ను తయారు చేశామన్నారు. ఈ వాషింగ్ మెషీన్ ధర రూ.21,790 నుంచి ప్రారంభం అవుతుందన్నారు.