Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 145 పాయింట్ల నష్టం
ముంబయి : రష్యా, ఉక్రెయిన్ మధ్య సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ బుధవారం భారత మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురైయ్యాయి. ఇంతక్రితం సెషన్లో భారీగా పెరిగిన సూచీల్లో అమ్మకాల ఒత్తిడి కనబడింది. ఉదయం సెన్సెక్స్ 58,310 వద్ద ప్రారంభం కాగా.. ఆద్యంతం ఊగిసలాట కొనసాగింది. ఇంట్రాడేలో 58,569 - 57,780 మధ్య కదలాడింది. ఓ దశలో 789 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ తుదకు 145 పాయింట్లు లేదా 0.25 శాతం కోల్పోయి 57,997 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 30 పాయింట్లు తగ్గి 17,322 వద్ద ముగిసింది.