Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్ స్పేస్ నాన్-ఫంగిబల్ టోకెన్స్ (NFTs)కు పాదార్పణ చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం ఎన్ఎఫ్టి మార్కెట్‌ప్లేస్ ఫుల్లీఫాల్తూఎఫ్టి. కాం (Fullyfaltoonft.com) వయాకాం 18 ఇప్పుడు యూత్ మ్యూజిక్ అండ్ ఇంగ్లిష్ ఎంటర్టెయిన్మెంట్ క్లస్టర్‌ను రూపొందించింది మరియు GuardianLink.io మద్ధతుతో రూపుదిద్దుకోగా, ఇప్పటికే తన డిజిటల్ ఆర్ట్ వర్క్ ప్రివ్యూలో అభూతపూర్వమైన ప్రతిస్పందనను పొందింది. ఈ వేదిక ఇప్పుడు 3013 విలువైన టోకెన్లను తన ఎండ్ యూజర్లకు అందిస్తుండగా, ఫిబ్రవరి 14 సాయంత్రం 6.00కు లైవ్‌గా అందుబాటులోకి వచ్చింది. ఆకర్షణీయమైన డిజిటల్ కార్యక్రమంలో విడుదల చేయగా, ఈ విడుదల పలురకాల ఆసక్తికరమైన క్షణాలకు సాక్షిగా నిలిచి, ఓజీ బకరా సైరస్ బ్రోజ్ బక్రా ఎన్ఎఫ్టిను కొనుగోలు చేశారు అలాగే ఎన్ఎఫ్టి భవిష్యత్తు గురించి నిపుణులు చర్చించగా, వయాకాం 18లో వైఎంఇ అండ్ ఇంగ్లిష్ ఎంటర్టెయిన్మెంట్కు బిజినెస్హెడ్ అన్షుల్ ఐలావాడి; గార్డియన్ లింక్ సహ-వ్యవస్థాపకుడు కేయుర్ పటేల్; కలారి క్యాపిటల్ వ్యవస్థాపకురాలు మరియు మేనేజింగ్ డైరెక్టర్ వాణి కోల, ఎన్ఎఫ్టిలో అగ్రశ్రేణి కళాకారిణి అక్షితా పటేల్ పాల్గొన్నారు. భారతదేశంలో వినూత్న తరహా యువ మనోరంజన బ్రాండ్ అయిన వినియోగదారులు విస్తృత శ్రేణి పాప్-సంస్కృతి ప్రేరిత అపురూపమైన అలాగే లూట్ ఆర్ట్ వర్క్ ప్రేరిత కైసీ యే యారియాన్ మరియు బక్రా షోల నుంచి స్ఫూర్తి పొందిన డిజిటల్ కలెక్టిబుల్స్‌ను వినియోగదారులు చూడవచ్చు. ఈ కళాకృతులు ప్రపంచ వ్యాప్తంగా లూట్ మరియు రేర్ రెండు విభాగాల్లో అందుబాటులో ఉంటుంది. లూట్ విభాగంలోని డిజిటల్ ఆర్ట్ పోషకులను ఆసక్తిదాయకమైన డిజిటల్ కలెక్టిబుల్స్ అయిన ‘బక్రా ఉరుఫ్ జి.ఒ.ఎ.టి’, ‘రంగు ది ఛాంప్’, ‘వింగింగ్ ఇట్ అకా వింగ్ ఇట్ లైక్ వింగ్నేష్’ తదితరాలు చౌకగా నుంచి ప్రారంభమవుతుండగా, దాన్ని వారు ర్యాండమైజనర్గా యాజమాన్యాన్ని పొందవచ్చు. రేర్ కలెక్షన్లో రిజర్వు ధర ఉండగా ‘డంక్ దట్ జంక్’, మరియు ‘ఎ పాండాస్ గ్రే అనాటమి’ మాత్రమే కాకుండా షో ‘కైసీ యే యారియాన్’ నుంచి స్ఫూర్తి పొందిన ప్రత్యేక వ్యాలెంటైన్ టోకెన్ పొందవచ్చు. రేర్ కలెక్షన్ యజమానులు 7 రోజుల బిడ్ అవధి చివరిలో కలెక్టిబుల్ గెలుస్తారు. కనిష్ఠ వ్యాలెట్ టాపప్ మాత్రం. లావాదేవీల సరళతతో వినియోగదారులు ఫ్లాట్ కరెన్సీ వినియోగించి ప్రత్యేక డిజిటల్ ఆర్ట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.
ఎన్ఎఫ్టి ఎకోసిస్టమ్‌కు పాదార్పణ గురించి వయాకాం18లో యూత్, మ్యూజిక్ అండ్ ఇంగ్లిష్ ఎంటర్టెయిన్మెంట్ అధికారి అన్షుల్ ఐలావాడి మాట్లాడుతూ, ‘‘ఫుల్లీ ఫాల్తూ మా సూపర్ ఫ్యాన్లు మరియు కలెక్టర్లకు ఐకానిక్ పాప్ సంస్కృతిలో భాగంగా యాజమాన్యాన్ని దక్కించుకునేందుకు అవకాశాన్ని ఇస్తుంది. మా మొదటి 3013 ఎన్ఎఫ్టిలు వెబ్ 3.0 ప్రపంచంలోకి ఆసక్తిదాయకమైన మరియు ఉత్సాహకరమైన ప్రయాణానికి ప్రారంభం మాత్రమే. ఈ చమత్కారమైన కలెక్షన్ మా డైనమిక్ వినియోగదారులతో ప్రస్తుత బాంధవ్యాలను మరింత ఎక్కువ చేస్తుంది మరియు ఎక్కువ అభిమానులను సృష్టిస్తాము మరియు వర్చువల్ ప్రపంచంలో మా క్రియాశీలతను వృద్ధి చేస్తుంది’’ అని తెలిపారు.
దీని గురించి గార్డియన్లింక్.ఐఓ సహ-వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు కేయూర్ పటేల్ మాట్లాడుతూ, ‘‘ఎన్ఎఫ్టిలు స్పష్టంగా ఆర్ట్ బిజినెస్‌కు భవిష్యత్తుగా ఉన్నాయి మరియు ఫుల్లీ ఫాల్తూ ఎన్ఎఫ్టి కలెక్షన్‌ను అది స్పష్టంగా ప్రత్యేకంగా నిలిచే ప్రత్యేక ప్రస్తావనతో రూపొందించాము. బ్రాండ్ విలువలు మరియు ఔట్‌లుక్‌ను స్పష్టంగా ప్రతిధ్వనించే ఈ ప్రత్యేక కలెక్షన్‌కు జీవాన్ని నింపుతున్నందుకు మాకు చాలా థ్రిల్‌గా ఉంది. వయాకాం18తో ఈ భాగస్వామ్యం అత్యంత ఉత్సాహకరంగా ఉంది మరియు వయాకాం18లో వైఎంఇ క్లస్టర్‌కు ఎన్ఎఫ్టి ప్రత్యేకమైన అలాగే అంతిమ వినియోగదారులకు మరింత విలువను సృష్టించేందుకు నిరీక్షిస్తున్నాము’’ అని తెలిపారు. సాంకేతికతలో తీవ్ర ప్రగతితో వయాకాం 18లో యూత్, మ్యూజిక్ అండ్ ఇంగ్లిష్ ఎంటర్టెయిన్మెంట్ క్లస్టర్ తన వినియోగదారులకు ‘వెబ్3 రివల్యూషన్’లో లీనమయ్యేలా చేసే వర్చువల్ అనుభవాలను ఆవిష్కరించే మరియు సృష్టించడాన్ని కొనసాగిస్తుంది. ఎన్ఎఫ్టి ప్లాట్ఫారం Fullyfaltoonft.com తన ఖాతాలోకి మరింత గమనార్హమైన ఎన్ఎఫ్టిలను చేర్చుకోవడాన్ని కొనసాగిస్తుంది మరియు అత్యంత అవసరంగా అలవర్చుకోవలసిన డిజిటల్ ఆర్ట్ కేంద్రంగా తన పరిధిని విస్తరించనుంది. ఎంటివి, ఎంటివి బీట్స్, విహెచ్1, కామిడీ సెంట్రల్ మరియు కలర్స్ ఇన్ఫినిటీ వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి స్ఫూర్తి పొందిన సృజనశీలమైన డిజిటల్ ఆర్ట్‌ను పొందేందుకు fullyfaltoonft.com ఇక్కడ నేడే భేటీ అవ్వండి!