Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశపు అతిపెద్ద అభ్యాస వేదిక అన్అకాడమీ నేడు జాతీయ స్థాయిలో తాము నిర్వహించబోతున్న స్కాలర్షిప్ పరీక్ష ‘అన్అకాడమీ ప్రోడీజీ’ని పొడిగించింది. అదనపు పరీక్షను 27 ఫిబ్రవరి 2022 న నిర్వహించబోతుంది. ఈ పరీక్షలు ఇప్పటికే 23 జనవరి, 29 జనవరి, 6 ఫిబ్రవరి, 13 ఫిబ్రవరి2022 తేదీలలో నిర్వహించారు. ఈ పరీక్షలలో జెఈఈ, నీట్–యుజీ మరియు 07 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పరీక్షలకు పలువురు అభ్యాసకుల నుంచి ఆసక్తి ఎక్కువగానే లభించింది. ఈ నాలుగు పరీక్షల కోసం దాదాపు ఐదు లక్షల మంది నమోదు చేసుకున్నారు. దాదాపు 10 కోట్ల రూపాయల బహుమతులను వీరు గెలుచుకున్నారు. పన్నెండు కళాశాలలు ఒక్కోటి 20 లక్షల రూపాయల గ్రాంట్‌ను 29 జనవరి మరియు 13 ఫిబ్రవరి తేదీలలో నిర్వహించిన పరీక్షలలో అత్యుత్తమ ర్యాంకులను పొందిన విద్యార్ధులకు అందించనున్నట్లు ప్రకటించాయి. ఈ విజేతలను 27 ఫిబ్రవరిన ప్రకటించనున్నారు. అన్అకాడమీ ప్రోడీజీలో పాల్గొనడం ద్వారా ఔత్సాహికులు ఆసక్తికరమైన రివార్డులు గెలుపొందే అవకాశం లభించడంతో పాటుగా అన్అకాడమీ సబ్స్ర్కిప్షన్స్పై 100 స్కాలర్షిప్లను సైతం పొందవచ్చు. రాబోయే పరీక్ష కోసం అభ్యాసకులు తమను తాము నమోదు చేసుకోవడంతో పాటుగా మరింత సమాచారం https://unacademy.com/scholarship/prodigy2022 వద్ద పొందవచ్చు.