Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జీవిత భీమా ఆవశ్యకతను తెలుపుతున్న భారతదేశంలో సుప్రసిద్ధ అడ్వొకసీ సంస్ధ లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తమ అత్యంత ప్రాచుర్యం పొందిన, సంబంధితమైన ‘సబ్సే పహలే లైఫ్ ఇన్సూరెన్స్ (అన్నిటికన్నా జీవిత బీమా ముందు)’ ప్రచారాన్ని ఫిబ్రవరి 2022లో తిరిగి ప్రారంభించింది. ఈ ప్రచారం, 24 భారతీయ జీవిత భీమా సంస్థల ఉమ్మడి ప్రయత్నానికి ప్రాతినిథ్యం వహిస్తుంది. వీరంతా దేశంలో జీవిత భీమా పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఓ సాధారణ కథనాన్ని సృష్టించారు.
డీడీబీ ముద్ర గ్రూప్ నేపథ్యీకరించిన ఈ ప్రచారం, జీవిత భీమా ఆవశ్యకత పట్ల అవగాహన విస్తరించే రీతిలో ఉండటమే కాదు, జీవిత భీమా పట్ల ప్రస్తుతం ఉన్న అపోహలను సైతం తొలగిస్తుంది. భారతదేశంలో జీవిత భీమా పట్ల అవగాహన అధికమే అయినప్పటికీ, ప్రతి ఒక్కరూ జీవిత భీమా ఎందుకు తీసుకోవాలనే అంశం పై మాత్రం చాలా మందికి స్పష్టత లేదు. దీని గురించి తెలుపుతూనే రక్షణ, పొదుపు, రిటైర్మెంట్ లక్ష్యిత పరిష్కారాలు వినియోగదారులకు అందుబాటులో ఉండటం గురించి కూడా ఈ రెండవ దశ కార్యక్రమం ద్వారా తెలుపనున్నారు. ఉదాహరణకు, గ్యారెంటీడ్ ఇన్కమ్ లేదా రిటైర్మెంట్ ప్రయోజనాలు ద్వారా పెట్టుబడి అవకాశంగా జీవిత భీమా అందించే ప్రయోజనాలను గురించి చాలామంది వినియోగదారులకు అవగాహన లేదు. జీవిత భీమాకు సంబంధించిన ఈ పెట్టుబడి కోణం వెలుగులోకి రాకపోవడానికి రాబడులను అందుకునేందుకు సుదీర్ఘకాలం వేచి చూడటం ఓ కారణం. కానీ పెట్టుబడులను గురించి మాట్లాడేటప్పుడు ఆ అవరోధాలను బద్దలుకొట్టడం అత్యంత కీలకం. ఇది మరింత మంది వినియోగదారులను ఈ విభాగం అందించే వైవిధ్యమైన ప్రయోజనాలను అందుకోవడానికి ఒప్పించగలుగుతుంది మరియు దీనియొక్క వైవిధ్యమైన రక్షణ, పొదుపు సంబంధిత అవసరాల ఔచిత్యం గురించి వెల్లడించగలుగుతుంది. రోజువారీ జీవితంలో జీవిత భీమా గురించిన చర్చను మరింత ఎక్కువ చేసే లక్ష్యంతో ప్రారంభించిన ఈ ప్రచారం సమగ్రమైన విధానం ద్వారా వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంది. ‘‘మా ప్రధాన లక్ష్యం, జీవిత భీమా పట్ల ప్రజలకు ఉన్న అవగాహన అర్థం చేసుకోవడం మరియు ఈ సంభాషణలను స్పష్టంగా, సానుకూలంగా ఉండేలా ప్రయత్నించండి. దేశంలో జీవిత భీమాను విస్తృతంగా గుర్తించినప్పటికీ, సురక్షితమైన భవిష్యత్ కోసం అన్ని వయసుల తరగతుల వ్యక్తులు జీవిత భీమాను కేవలం కొనుగోలు చేసే రీతిలో తగిన అవగాహన సృష్టించడం మాత్రమే గాక తమ భవిష్యత్ ఆర్ధిక భద్రతకు సైతం ఉపయోగపడే మార్గంగా భావించేలా చేయడం’’ అని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ ఎస్ఎన్ భట్టాచార్య అన్నారు. ఇంటిగ్రేటెడ్ మీడియా డీడీబీ ముద్ర గ్రూప్ కంట్రీ హెడ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్మోహన్ సుందరం మాట్లాడుతూ ‘‘భారతదేశంలో వృద్ధి చెందుతున్న యువత కోసం మార్కెట్లో విస్తృత స్ధాయిలో పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. వీరి వద్ద తగినంత డిస్పోజబల్ ఆదాయం ఉంది. ఈ ప్రచారం కేవలం యువత ఆలోచనా విధానాన్ని ధృవీకరించడమే కాదు, బహుళ మీడియా ఆవిష్కరణల ద్వారా దానిని బలోపేతం చేయడానికి ఉద్దేశించబడినది. ఈ త్రైమాసంలో విభిన్నమైన మాధ్యమాల వ్యాప్తంగా తమ ప్రచారం చేయాలనే తలపుతో పాటుగా ఈ ప్రచార చేరికను దృష్టిలో పెట్టుకుని ఈ కౌన్సిల్ , నెంబర్ 1 అడ్వర్టయిజర్ను సంప్రదించాలనుకుంది. బహుళ అంశాలలో విజయవంతమైన సంస్థగా కౌన్సిల్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు. దేశవ్యాప్తంగా బలమైన ప్రతిధ్వని సృష్టించేందుకు, ఈ ప్రచారాన్ని భారతదేశ వ్యాప్తంగా 40 నగరాలలో 25–55 సంవత్సరాల వయసు కలిగిన వీక్షకులను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించారు. ఈ ప్రచారం టీవీ, డిజిటల్, ప్రింట్, ఔట్‌డోర్‌తో పాటుగా కొన్ని వినూత్నమైన వేదికల వద్ద కూడా లభ్యమవుతుంది.