Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఎల్ఐసీ ఇనిషీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) మార్చి రెండో వారంలో రానుందని తెలుస్తోంది. మార్చి 11న యాంకర్ ఇన్వెస్టర్లు బిడ్లు దాఖలు చేయడానికి అనుమతినివ్వనున్నట్టు సమాచారం. మార్చి తొలి వారంలో ఐపీఓకు సెబీ అనుమతులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఇష్యూ ద్వారా దాదాపు రూ.60వేల కోట్ల విలువ చేసే షేర్లను మార్కెట్ శక్తులకు కట్టబెట్టాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సంస్థలోని 5 శాతం వాటాలను విక్రయించనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల తర్వాత.ఇతర మదుపర్లకు తదుపరి రోజుల్లో అనుమతి ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎల్ఐసీ గత ఆదివారం ఐపీఓకు సంబంధించిన దస్త్రాలను సెబీకి సమర్పించింది.