Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్వీట్ ప్యాకేజ్డ్ ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే ప్రముఖ తయారీదారైన ఫెరెరో గ్రూపులో భాగమైన ఫెరెరో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బ్రాండ్ టిక్ ట్యాక్ రెండు కొత్త రుచులు- సోంప్, జింజర్ ఇలాచీ రుచులతో భారతదేశవ్యాప్తంగా టిక్ ట్యాక్ సీడ్స్ అనే కొత్త ఉత్పత్తిని ఆవిష్కరిస్తున్నట్టు నేడు ప్రకటించింది. భోజనం చేసిన తర్వాత గింజలు, మసాలాలు, చక్కెర పలుకలతో కూడిన తాంబూలం వేసుకోవడం భారతీయ సంప్రదాయంలో బలంగా నాటుకుపోయింది. ఈ సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని టిక్ ట్యాక్ ఇప్పుడు గింజల పలుకులతో చాలా సేపు నిలిచిపోయే ఒక వినూత్న రుచిని టిక్ ట్యాక్ సీడ్స్ పేరుతో ప్రవేశపెట్టింది. సంప్రదాయ తాజాదనంతో కూడిన ఈ సీడ్స్, రిప్రెష్మెంట్ కేటగిరీలో టిక్ ట్యాక్ స్థానాన్ని బలోపేతం చేస్తాయి. ఇటీవల రూ.1 ధరను ప్రవేశపెట్టిన టిక్ ట్యాక్ తన ఉత్పత్తులను విస్తరించి మరింత మంది వినియోగదారులకు చేరువైంది. టిక్ ట్యాక్ సీడ్స్ రూ.1. రూ.10 ధరల్లో అందుబాటులో ఉంటాయి. టిక్ ట్యాక్ సీడ్స్ మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి. వీటిని బారామతి, పుణేలోని ఫెరెరో ఇండియా ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. కొత్త ఉత్పత్తి విడుదల సందర్భంగా టిక్-ట్యాక్, రోచర్, న్యూటెల్లా ఇండియా మార్కెటింగ్ హెడ్ శ్రీ జోహెర్ కాపూస్వాలా మాట్లాడుతూ, “భారతదేశం చిన్న లావాదేవీల మార్కెట్. సంప్రదాయాలపై భారతదేశం చూపే అనుబంధాన్ని అర్థం చేసుకోవడానికి భారతీయ యువతతో చేసిన విస్తృతమైన మార్కెట్ పరిశోధన ఫలితంగా టిక్ ట్యాక్ సీడ్స్ అనే కొత్త ఉత్పత్తిని ఆవిష్కరించాం. టిక్ టాక్ సీడ్స్ ఆవిష్కరణ అన్నది మా ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో విస్తరణను చూపడమే కాదు సంప్రదాయాలపై వినియోగదారుల చూపే అభిరుచిపై మనకున్న అవగాహనను కూడా తెలియజేస్తుంది. రూ. 1 ధర వ్యూహం మా మార్కెట్ బేస్‌ని విస్తరించడానికి, పెద్ద సంఖ్యలో వినియోగదారులకు 'టిక్ టాక్ సీడ్స్'ని అందుబాటులోకి తీసుకురావడానికి అనుమతిస్తుంది” అన్నారు.
భిన్నమైన భారతీయ రుచులకు అనుగుణంగా గొప్ప రుచులు అందించేందుకు టిక్ ట్యాక్ నిరంతరం కృషి చేస్తూనే ఉంది. ప్రస్తుతం మింట్, ఆరెంజ్, సోంపు, రెడ్ యాపిల్ రుచులు అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయపు సుగుణాల విషయంలో రాజీపడకుండా తాజాదనం, మైమరపింపజేసే రుచుల అనుభూతిని అందిస్తూ వినియోగదారులతో మరింత కనెక్ట్ అయ్యేందుకు ఇప్పుడు టిక్ ట్యాక్స్ సీడ్స్ ప్రయత్నిస్తుంది. రానున్న సంవత్సరాల్లో టిక్ ట్యాక్స్ సీడ్స్‌లో మరిన్ని రుచులు చేర్చడం ద్వారా కంపెనీ తన పోర్టుఫోలియోను విస్తరించనుంది. వినోదం, తాజాదనం, ఆనందం, కనెక్టివిటీని సూచించే బ్రాండ్‌గా టిక్ టాక్ స్థానం సంపాదించుకుంది. వినూత్నమైన ఫ్లిప్ టాప్ ప్యాక్ లోపల అనేక బిళ్లలు, ఊపినప్పుడు విచిత్రమైన శబ్ధం వంటివన్నీ ఇతర బ్రాండ్లతో టిక్ టాక్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.